భారత దేశంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటిలో వరుసగా  దీపాలు ఏర్పాటు చేసి దీపాల విరాజిల్లుతున్న వేడుకల్లో టపాకాయలు కాలుస్తూ దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భారతీయులు. ఉన్న వారైనా లేని వారైనా ఉన్నంతలో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి నాడు వరసగా దీపాలు ఏర్పాటు చేయడంవల్ల... లక్ష్మీదేవి కరుణా కటాక్షాలకు పాత్రులు కావచ్చు అని భారతీయ ప్రజల నమ్మిక. ఇంటిలోపల ఇంటి వెలుపల ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా చీకటి కనిపించకుండా దీపాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా రంగురంగుల విద్యుత్ బల్బులతో ఇంటిని అలంకరిస్తారు ప్రజలు. 

 

 

 

 అయితే ఒకప్పుడు భారత దేశానికి మాత్రమే పరిమితమైన దీపావళి పండుగ... ప్రపంచ దేశాలకు పాకుతుంది . ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. దీపావళి పండుగ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే పాశ్చాత్య దేశాల్లో  సెలబ్రేషన్స్ ప్రారంభమవుతున్నాయి. దాంట్లో పాటలు వివిధ ప్రోగ్రాముల తో దీపావళి జరుపుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు ప్రపంచ దేశాలు. 

 

 

 

 భారతీయుల పండుగలంటే... అమెరికా నుంచి జపాన్ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇప్పటికి గణేష్ చతుర్థి దసరా పండుగను జరుపు కుంటున్నాయి ప్రపంచ దేశాలు . దీపావళి పండుగను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి . ఇప్పటికే చాలా దేశాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దీపావళి నాడు. అమెరికా దుబాయ్ లాంటి దేశాల్లో దీపావళి సంబరాలు అయితే... మునుపెన్నడూ చూడలేనంత అందంగా అంగ  రంగ వైభవంగా జరుగుతున్నాయి. 

 

 

 

 దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలి అక్కడి భారతీయులను  అడిగి దీపావళి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుని  పండుగ సంబరాల్లో చేసుకుంటున్నారు  విదేశీయులు. దీపావళి పండుగను జరుపుకోవడానికి బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. అమెరికా దుబాయ్ దక్షిణాఫ్రికా దేశాల్లో సైతం దీపావళి పండుగ వచ్చే వారం రోజుల ముందు నుంచే డెకరేషన్లు  వివిధ నృత్య కార్యక్రమాలు ఆటలు పాటలతో హోరెత్తి పోతుంటుంది. మన భారతీయులందరూ రంగురంగుల దీపాలతో ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి ...శుతి  శుభ్రతతో ఇల్లు శుభ్రంగా ఉంచుకుని లక్ష్మీదేవి పూజ నిర్వహించి.... టపాకాయలు కాల్చి   దీపాల వెలుగులో టపాకాయల  మెరుపుల్లో దీపావళి పండుగను జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: