తెలంగాణాకు డెంగ్యూ ఫీవర్‌లాగా, ఏపీకి ఇసుక కొరత పట్టుకుని పీడిస్తుంది. ఈ విషయంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్దం ఘాటుగానే సాగుతుంది. ఈ నేపధ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఇసుక కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని.. ఇసుక కొరతపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఎం జరుగుతుందో తెలుసుకోకుండా ఇసుక అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.


ఇకపోతే  భారీగా వరద ప్రవహిస్తుండడంతో నదులు, వాగుల్లో ఇసుక తవ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఇకపోతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చల విడిగా ఇసుక తోడేయడంతో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమానా విధించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యావరణ చట్టాలను అనుసరించి ఇసుక విధానం రూపొందిస్తున్న క్రమంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి భవన నిర్మాణ కార్మికులతో ఉద్యమం చేయించాలని ఆలోచించడం సరైన విధానం అనిపించుకోదని పేర్కొన్నారు..


ఇక వరదలు తగ్గాక నదులు, వాగుల్లో  లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇకపోతే ఎం చేయాలో పాలుపోక, అభివృద్దిని చూస్తూ ఓర్వలేని చంద్రబాబు, బ్రహ్మాజీ అనే భనవ నిర్మాణ కార్మికుడు కుటుంబ కారణాల వల్ల చనిపోతే ఇసుక కొరత వల్లే మరణించాడని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. చివరిగా అంబటి ట్వీట్ ఇస్తూ పవన్‌ కల్యాణ్‌ పై తమకు గౌరవం ఉందని, కాని వారు రాజకీయ విమర్శలు చేస్తే మాత్రం ధైర్యంగా తిప్పి కొడుతూ, ప్రతి విమర్శలు కూడా చేస్తామని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఏనాడూ చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ విమర్శించలేదని గుర్తుచేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: