భారత దేశంలో ప్రజలందరూ జరుపుకునే ముఖ్య పండుగలలో ఒకటైన పండుగ దీపావళి. దీపాల కాంతులతో దేశమంతటా వెలుగులోకి అభిరుచి మీద చేసే పండుగ ఈ దీపావళి. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఉన్నవారైనా లేని వారైనా ఉన్నంతలో ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. టపాకాయలు కాలుస్తూ ఇంటి ఆవరణలో దీపాలు వెలిగిస్తూ... దీపాల వెలుగుల్లో  దీపావళి జరుపుకుంటారు  . అయితే చెన్నైకి చెందిన ఆనంద్ అనే ఓ బట్టల వ్యాపారి దీపావళికి  పేదల కళ్లల్లో  ఆనందం నింపేందుకు  అద్భుత ఆలోచన చేశాడు. 

 

 

 

 దీపావళి పండుగ నేపథ్యంలో పేదల కళ్ళల్లో ఆనందం నింపేందుకు  ప్రజలకు ఓ బంపర్  ఆఫర్ ప్రకటించాడు. చాకలి పేటలో తాను నిర్వహిస్తున్న బట్టల దుకాణంలో ఈనెల 19 నుంచి 26 వరకు రోజూ ఓ గంట పాటు ప్రత్యేక ఆఫర్లలలో  దుస్తులు విక్రయించాడు . ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయం వరకు కేవలం ఒక్క రూపాయికే చొక్కా... పది రూపాయలకు నైటీ విక్రయించనున్నట్లు  ప్రకటించడంతో పేద ప్రజలు అతని దుకాణానికి క్యూ కట్టారు. అయితే నిజానికి 50 మందికి మాత్రమే ఆఫర్లో  విక్రయించాలని అనుకున్నాడు ఆనంద్. కానీ ఆఫర్ కు ఆకర్షితులై ఎక్కువ మొత్తంలో పేదలు పోటెత్తడంతో ఆ సంఖ్యను 200 గా మార్చాడు. 

 

 

 

 

  అయితే ఆనంద్ ప్రకటించిన ఆఫర్ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఉండడంతో... దుస్తులు దక్కించుకునేందుకు ప్రజలు వేకువజాము నుంచే దుకాణం ముందు క్యూ  కట్టడం మొదలుపెట్టారు. అయితే వారం రోజుల పాటు ఈ ఆఫర్ ను  అందుబాటులో ఉంచిన ఆనంద్... వేలాది మంది పేద ప్రజలకు ఇలా రూపాయికే చొక్క 10 రూపాయలకే నైటి ని  విక్రయించి వారి కళ్లలో ఆనందం నింపాడు . ఈ సందర్భంగా మాట్లాడిన బట్టల వ్యాపారి ఆనంద్.... ఏదైనా ఒక వస్తువును ఉచితంగా అందిస్తే దానికి విలువ ఉండదని ... అందుకనే ఇలా రూపాయి, పది రూపాయలు ధర నిర్ణయించి విక్రయించినట్లు చెప్పాడు. దీపావళి నాడు పేదలు  కొత్త దుస్తులు ధరించి దీపావళి పండుగను జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపాడు ఆనంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: