ఈ ప్రపంచంలో తెలివిగా ఆలోచించేది ఎవరు అంటే మనిషే అని చెప్తారు.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి... మనుషులే కాదు ఈ భూమిపై చాలా జంతువులు మనిషిలా ఆలోచిస్తాయని శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.  చాలా వరకు విజయం సాధించారు.  అలా విజయం సాధించిన వాటిల్లో  ఎలుకలు కూడా చేరిపోయాయి.  ఎలుకలు చేరిపోవడం ఏంటి అని షాక్ అవ్వకండి.  అక్కడికే వస్తున్నా.. 


ఈ మధ్యకాలంలో ఎలుకలు బాగా తెలివి సంపాదించాయి.  ప్రతి విషయంలో చురుగ్గా ఉంటున్నాయి.  వ్యాధులను వ్యాపించజేయడంలో కూడా ఇవి చాలా చురుగ్గా ఉంటాయి.  అంతేకాదు, ప్రకృతి అదుపుచేయలేకపోతే.. ప్రపంచంలో భూమి మొత్తం ఈపాటికి ఎలుకలతో నిండిపోయేది.  వాటి సంతానం కలిగే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది.  ఇక మనుషులలో ఉండే అవయవాలకు.. ఎలుకల్లో ఉండే అవయవాలకు సారూప్యత ఉంది.  అందుకే శాస్త్రవేత్తలు మొదటగా ఎలుకలపై ప్రయోగాలు చేస్తారు.  


ఎలుకలపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయితే.. వాటిని బేస్ చేసుకొని మనుషులపై ప్రయోగిస్తారు.  అందుకే ఎలుకలను మొదటగా వీటికోసం ఉపయోగించుకుంటూ ఉంటారు.  ఇక ఇదిలా ఉంటె,  మనిషి ఉన్న తెలివి దాదాపుగా ఎలుకలకు ఉన్నట్టుగా పరిశోధనలో వెళ్ళడయింది.  మరి అలాంటప్పుడు ఎలుకలు ఎందుకు కార్లు నడపలేవు అనే విషయంపై పరిశోధన చేయాలని అనుకున్నారు.  అనుకున్నట్టుగా ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు.  


దీనికోసం బుల్లి కారును తయారు చేశారు.  ఆ కారుకు పైన ఒక డబ్బా పెట్టారు అవి బయటకు రాకుండా ఉండేందుకు. ఇక దూరంగా ఎలుకలు ఇష్టంగా తినే ఆహరం పెట్టారు. ఆ ఆహరం కోడం ఎలుకలు బయటకు రావాలి.  కానీ బయటకు వచ్చేందుకు వీలు లేదు.  వెంటనే ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ ఆహారం దగరికి వెళ్లి దాన్ని తినేశాయి.  ఇలా ఒకటికాదు రెండు కాదు.. మొత్తం 17 ఎలుకలపై ఇలా ప్రయోగాలు చేశారు.  అన్ని ఎలుకలు అనుభవం కలిగిన డ్రైవర్లలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాయి.  ఇది అద్భుతం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: