ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి మొదటి నుంచి  జోరు చూపించి మ్యాజిక్ ఫిగర్  కంటే ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంది. గత ఎలక్షన్ లో గెలిచిన దానికంటే తక్కువ సీట్లు గెలిచినప్పటికీ ప్రస్తుతం బిజెపి శివసేన కూటమి అధికారం తగ్గించుకోవడానికి అవసరమైన మెజారిటీ కి తగినట్లుగా సీట్లు సాధించింది. అయితే ప్రస్తుతం బిజెపి శివసేన కూటమి మధ్య  సీఎం పీఠాన్ని పంచుకునే విషయంపై ప్రతిష్టంభన ఏర్పడడంతో... మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బిజెపి శివసేన రెండు పార్టీలు రెండున్నరెళ్ళ  చొప్పున సీఎం పీఠాన్ని పంచుకోవాల్సిందేనని  తమ పార్టీ యువనేత ఠాక్రేకు తొలి రెండున్నరేళ్లు సీఎం పదవి కట్టబెట్టాలని  శివసేన పట్టుబడుతోంది. ఇందుకు  బిజెపి పార్టీ నుంచి లిఖితపూర్వకంగా హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది శివసేన. బిజెపి పార్టీ ఈ  ఒప్పందానికి సరే అంటేనే బిజెపి పార్టీకి తమ  మద్దతు ఉంటుందని శివసేన  పార్టీ అధిష్టానం బిజెపికి తేల్చి చెప్పింది. 

 

 

 

 అయితే శివసేన డిమాండ్లను అంగీకరించేందుకు బిజెపి పార్టీ ఏ మాత్రము సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. శివసేన పార్టీకి రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి కట్టబెట్టినందుకు బిజెపి అంగీకారం తెలుపుతున్నట్లు కనిపించడం లేదు. ఇదే సమయంలో శివసేన నేతలందరూ... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మంతనాలు  జరుపుతున్నారని.... ఎన్సీపీ శివసేన కూటం తో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఎన్సిపి అధినేత శరత్ పవర్... శివసేన కు  తాము మద్దతిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని శివసేన కు మద్దతు ఇచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం  చేశారు. 

 

 

 

 ఇదిలా ఉండగా తమతోపాటు పోటీచేసి మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఎన్సీపీ పార్టీ... అధికార పీఠాన్ని పొందేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవాలి అని కాంగ్రెస్ అధిష్టానం ఎన్ సిపి పార్టీ అధినేత శరద్ పవార్ కు  సూచించినట్లు సమాచారం. ఒక వేల అవసరమైతే  తాము  పక్కకు తప్పుకుంటానని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం మహారాష్ట్రలో  నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో... మహా రాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: