రోజులు ఎపుడూ ఒకేలా ఉండవని అంటారు. అదే ఇపుడు జరుగుతోంది. ప్రధానిగా మోడీ కత్తికి ఎదురులేదు. అసలు ఆయన రాజకీయ జీవితమే పూలపానుపు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నేండేళ్ళ పాటు పనిచేశారు. అన్నీ విజయాలే. ఇక జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే మన్మోహన్ సింగ్ గరి చేత పీఎమ్  కుర్చీ ఖాళీ చేయించెశారు. గత ఆరేళ్ళుగా  రెండు దఫాలుగా అక్కడే పాతుకుపోయారు.


అంతా బాగుందనుకుంటే ఇపుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. స్వపక్షంలో లోనే విపక్షం  అంటే ఇదే. మిత్రుడు అంటూనే పులి లా శివసేన గర్జిస్తోంది. మా డిమాండ్లు తీర్చకపోతే ఇంతే సంగతులు అంటూ గట్టిగానే బెదిరించేస్తోంది. ఆ విషయంలో మోడీ కానీ, అమిత్ షా కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం బీజేపీదే. ఇక శివసేన వరకూ తీసుకుంటే దానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. మోడీ కాదంటే తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు.  అంటే దాని అర్ధం శివసేన  అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీపీతో, కలిపి సర్కార్ ఏర్పాటుకు రెడీ అని సంకేతాలు ఇస్తున్నారు.


ఇక రెండున్నరేళ్ల పాటు అధికారం అని నోటి మాటలు చెప్పవద్దు, లిఖితపూర్వకమైన హామీ ఇమ్మంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఎవరికీ లొంగని మోడీని వంచేస్తున్నారు థాకరే. అవును ఆయన పార్టీ గుర్తు పులి. మరి పులి నోట్లో తల పెట్టాక తప్పుతుందా. ఏది ఏమైనా మోడీ, అమిత్ షాలకు ఇపుడే సీన్ మెల్లగా అర్ధమవుతోంది. దూకుడుగా రాజకీయం చేసిన ఇద్దరు పెద్దమనుషులకు తమ దాకా వస్తేనే తప్ప సీన్ బోధపడడంలేదు. అందుకే ఒక్కసారిగా మల్లగుల్లాలు పడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: