ధూమ్ మచాలే... అనగానే మనకు ధూమ్ సినిమా గుర్తుకు వస్తుంది.  ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ చేసిన సాహసాలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతాయి.  వావ్ అనిపించే విధంగా ఫీట్స్ చేసి మెప్పించాడు హృతిక్ రోషన్.  ధూమ్ 2 సినిమాలో ఓ సన్నివేశం ప్రతి ఒక్కరిని మేపించింది.  అదే మ్యూజియంలోకి వెళ్లి వజ్రాన్ని దొంగతనం చేయడం.  ఆ సీన్ తీసిన విధానం ఎంత పక్కాగా ఉంటుంది అంటే.. నిజంగా ఇలానే జరుగుతుందేమో అనిపించే విధంగా ఉన్నది.  అలాంటి దొంగతనమే ఇప్పుడు జపాన్ లో జరిగింది.  


జపాన్ లోని యోకోహామాలో ఈ సంఘటన జరిగింది.  యోకోహమాలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 410 ఆభరణాల సంస్థలు అక్కడ తమ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు.  కొన్ని రోజులుగా ఆ ప్రదర్శన జరుగుతున్నది.  ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధి చెందిన ఆభరణాల సంస్థలు తమ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు అంటే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు.  


కోట్లాది విలువచేసే వజ్రాలు, ఆభరణాలు బారులు తీరి ఉంటాయి.  వాటిని వేయి కళ్ళతో కాపలా కాస్తుంటారు.  పదుల సంఖ్యలో సిసిటీవీలు నిత్యం అక్కడి విషయాలను పర్యవేక్షిస్తుంటుంది.  రికార్డ్ చేస్తుంటుంది.  ప్రదర్శనకు చూడటానికి వచ్సిన వ్యక్తులు వాటిని చూసి వావ్ అంటూ మెచ్చుకుంటున్నారు.  అలాంటివి తాము కూడా కొనుక్కోవాలని అనుకోవడం సహజమే.  డబ్బు ఉంటె ఏదైనా చెయ్యొచ్చు.  


ఇదిలా ఉంటె, ప్రదర్శన ఆకట్టుకునే విధంగా సాగుతుంది.  రోజులాగానే ప్రదర్శన ముగించే సమయం వచ్చింది.  ఈలోగా 50 క్యారెట్ల బరువున్న రూ. 13 కోట్ల రూపాయలు విలువచేసే వజ్రం మాయం అయ్యింది.  దీంతో షాక్ అయ్యారు. సెక్యూరిటీ అలర్ట్ అయ్యింది.  ఎవరు తీశారో తెలియదు.  ప్రస్తుతం ఆ వజ్రం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  ఎవరు కొట్టేశారోగాని భలేగా కొట్టేశాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: