ఓ మోసగాడు సహాయం చేస్తా అని చెప్పి లక్ష కొట్టేశాడు. మాములుగా కొంచం వయసు ఎక్కువ ఉన్నవారికి ఏటీఎం ఎలా వినియోగించుకోవాలో తెలియదు. అలాంటి వారు ఈ పక్కన ఎవరైనా ఉంటె వారి సహాయంతో ఏటీఎం నుంచి డబ్బుని తీసుకుంటారు. అయితే ఆలా సహాయం చేసినట్టే చేసి ఓ మోసగాడు ఏకంగా లక్ష రూపాయిలు కొట్టేసిన ఘటన విజయవాడలో జరిగింది. 

                 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి ఖాతా నుంచి లక్ష రూపాయిలు చోరీకి గురైనట్టు విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రమూర్తి అనే వ్యక్తి ఆగస్టులో విజయవాడ పటమటలోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు తీసేందుకు వెళ్లారు.

                  

అయితే అక్కడ కార్డు పెట్టిన తర్వాత అది రాకపోవడంతో వెనుక ఉన్న ఓ వ్యక్తి ఆలా కాదు ఇలా అంటూ నగదు తీసి ఇచ్చాడు. అప్పుడే పిన్ నెంబర్ కూడా తెలుసుకున్నాడు. అయితే డబ్బు తీసిన తరువాత కార్డు ఇచ్చేముంది వేరే కార్డు మర్చి ఇచ్చాడు. ఈ విషయాన్నీ ఆ పెద్ద అయన గమనించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. 

          

అయితే ఆ వ్యక్తి దొంగిలించిన కార్డును ఉపయోగించి రూ.20 వేలు చొప్పున నాలుగుసార్లు నగదు దొంగిలించాడు. అయితే డబ్బు తీసినట్టు ఫోన్ కు మెసెజ్ రావడంతో, అనుమానం వచ్చి కార్డు చూసుకోగా, అది ఆయనది కాదని గుర్తించి, వెంటనే బ్యాంకు అధికారులకు ఫోన్‌ చేసి, కార్డు బ్లాక్‌ చేయించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: