ఐసిస్ ఈ పేరు వినగానే ప్రజలు గుండెల్లో వణుకు పుడుతుంది ఎందుకంటే వీరు ప్రజల్ని మరియు సైనికుల్ని అంత క్రూరంగా చంపుతూ ఉంటారు. దానికి సంబంధించిన వీడియోలు తీసి మరి ప్రపంచానికి చూపించి ఇంకా భయపడుతూ ఉంటారు .అలాంటి వారి అధ్యక్షుడు ఇలా పైన అమెరికా దాడి చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్-బగ్దాదీ లక్ష్యంగా అమెరికా సైన్యం ఆపరేషన్ చేపట్టిందని ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే, అమెరికా అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.అధ్యక్షుడు ట్రంప్ "చాలా పెద్ద సంఘటన ఒకటి ఇప్పుడే జరిగింది" అని తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఈ ట్వీట్ మూడు గంటల ముందు చేశారు. అంటే అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10.30కు దీన్ని పెట్టారు.
సిరియా ప్రాంతంలోని ఇడ్లిబ్‌లో అబూ బకర్ అల్-బగ్దాదీను టార్గెట్‌గా ఒక ఆపరేషన్ చేపట్టడానికి ట్రంప్ అమెరికా సైన్యానికి అనుమతి ఇచ్చారని అమెరికా మీడియా చెబుతోంది.

అమెరికా సైనిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం "ఐఎస్ చీఫ్ బగ్దాదీ మరణించాడు" అని న్యూస్‌ వీక్ మ్యాగజైన్ చెప్పింది. కానీ ఇప్పటివరకూ దీనిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. గతంలో కూడా బగ్దాదీ చనిపోయాడని చాలాసార్లు వార్తలు వచ్చాయి.అబూ బకర్ అల్ బగ్దాదీని ఇస్లామిక్ స్టేట్ చీఫ్‌గా చెబుతారు. గత ఐదేళ్లుగా ఆయన అండర్ గ్రౌండ్‌లో ఉన్నారు.


ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ మీడియా వింగ్ అల్-ఫుర్క్వాన్ తరఫున ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బగ్దాదీ బతికే ఉన్నట్టు చెప్పారు.2014 జులైలో మోసూల్‌లోని పవిత్ర మసీదు నుంచి ప్రసంగించినపుడు బగ్దాదీ మొదటిసారి బయట కనిపించారు.2017 మేలో జరిగిన వైమానిక దాడుల్లో బగ్దాదీ గాయపడ్డారని 2018 ఫిబ్రవరిలో అమెరికా అధికారులు చెప్పారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: