గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవడం ద్వారా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను చ‌ర్చ‌కు కార‌ణం అయిన వంశీ..తాజాగా దీపావ‌ళి రోజున తాను పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖ‌రారు చేసుకున్నారు. అయితే, తాను ఎమ్మెల్యే వంశీ బాధితుడిని అని పేర్కొంటూ...ఆయ‌న అన్యాయం చేసిన వారిలో తానూ ఒక‌డిన‌ని..ఓ వ్య‌క్తి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు గన్నవరం నియోజక ప్రజలకు లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


వల్లభనేని వంశి బాధుతుడు పాలనీడి ఫణి కుమార్ యాదవ్ అనే పేరుతో సోష‌ల్ మీడియాలో ఓ లేఖ చెలామ‌ణి అవుతోంది. ఆ లేఖ సారాంశం ఇది ``గౌరవనీయులైన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు గన్నవరం నియోజక ప్రజలందరికి నేను తెలియజేయనిది ఏమనగా వల్లభనేని వంశి చేసిన అన్యాయం చేసిన కుటుంబాలలో నా కుటుంబం కూడా ఒకటి. మా రామవరప్పాడు గ్రామంలోని మేము సాగు చేసుకుంటూ కొనుక్కున్న 1 .66  ఎకరా పొలముని పక్క గ్రామములో tdp నాయకులతో నీచమైన రాజకీయాలు చేసి ఈ వల్లభనేని వంశి మాకు చెందిన భూమిని ఆక్రమించి మా కుటుంబసభ్యులు అందరిమీద పోలీస్ కేసులు పెట్టి మమ్మలి 6 సంవత్స‌రాల‌ నుంచి వేధిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక మనోవేదనతో మా తండ్రిగారైన పాలనీడి నరసింహారావు గారు అకాల‌ మరణం చెందారు. ఇటువంటి హత్య రాజకీయాలు చేసే ఈ వల్లభనేని వంశీని ముఖ్యమంత్రి గారు తన పార్టీ లోకి తీసుకోవడం ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వంలో మాకు అన్యాయం చేసిన TDP  నాయకులే మన ycp పార్టీ లోకి వస్తున్నారు అంటే మాకు మన ప్రభుత్వంలో కూడా న్యాయం ఉండదా? ఇపుడు జరిగే పరిణామాలను చూస్తుంటే అన్యాయమే రాజ్యమేలుతుంది న్యాయమేనేది కనుమరుగవుతుంది . ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చేరేవరకు అందరు చేయాలనీ కోరుతున్నాను ఇట్లు  వల్లభనేని వంశి బాధుతుడు పాలనీడి ఫణి కుమార్ యాదవ్``అని త‌న పేరు, ఫోన్ నంబ‌రుతో స‌హా ఈ మెసేజ్ సర్క్యూలేట్ అవుతోంది.దీనిపై వంశీ, వైసీపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: