అమెజాన్‌ కార్చిచ్చు మరవకముందే ఇప్పుడు మరో అగ్నికీలలు అడవి తల్లిని చుట్టుముట్టాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. పొగలు దట్టంగా వ్యాపించాయి. లక్షలాది మంది కాలిఫోర్నియాను ఖాళీ చేశారు. వేల ఇళ్లు అగ్నికీలలకు దగ్ధమయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో కాలిఫోర్నియాలో ఎమెర్జెన్సీ ప్రకటించారు.


మూడు రోజుల క్రితం ఉత్తర కాలిఫోర్నియాలో అటవీ ప్రాంతలో రగులుకున్న మంటలు అంతకంతకు విస్తరిస్తోన్నాయి.  ఈదురుగాలులతో కూడిన కార్చిచ్చు విపరీతమైన వేగంతో విస్తరిస్తుంది. అగ్ని కీలలకు పసిఫిక్, గ్యాస్ ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన హైవోల్టేజ్ విద్యుత్ సరఫరా టవర్ ధ్వంసమైంది. ప్రమాదకరస్థాయిలో ఈదురుగాలులు, మంటలు విస్తరిస్తుండటంతో ప్రభుత్వం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు రెండు లక్షలకు పైగా కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి.


కాలిఫోర్నియాలో సోనమ్‌, లాస్‌ఎంజెల్స్‌ కౌంటీలో వేలాది మంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు. ఉత్తర కాలిపోర్నియాలోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అగ్నికీలల ధాటికి గీసేర్విల్లే పట్టణంలో వందలాది ఇళ్లు, 34 చదరపు మైళ్ల అటవీ ప్రాంతం దహనమైంది. రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కార్చిచ్చుకు కారణాలపై కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక శాఖ విభాగం దర్యాప్తు చేస్తున్నాయి.


రెండు రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్ధం అవుతోంది. హెక్టార్ల కొద్దీ  చెట్లు కార్చిచ్చు ధాటికి మండిపోతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కాలిఫోర్నియాలో ఎమెర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. ఈ కార్చిచ్చుకు కారణాలపై కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక శాఖ విభాగం దర్యాప్తు చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఇలా ప్రతి ఒక్కరూ అడవి తల్లి దుస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంతటి అటవీ సంపదను బూడిద అయిపోతుండటం చూసి ఏమిచేయాలో పాలుపోక ఆవేదన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: