చాలాకాలం క్రితం జరిగిన సంఘటనిది. అందులోనూ  ఇపావళి రోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం.  చైనాలోని హునాన్‌ ప్రాంతంలో లీ టియస్‌ అనే సాధువు కొన్ని రసాయనాల్ని కలిపి విచిత్రమైన మంటలు తెప్పించాడట. అవే టపాసులన్నమాట. ఆ సాధువుకు అక్కడ ఒక గుడి కూడా కట్టారు. ఏటా ఏప్రిల్‌ 18 ఆయనకు పూజలు చేసి బోలెడు టపాసులు కాలుస్తారు. అంతటి ప్రాచుర్యం కలిగిన టపాసులు ఇప్పుడు ఎక్కువగా  తమిళనాడులోని శివకాశి. దేశంలో అమ్ముడయ్యే బాణసంచాలో 95 శాతం అక్కడే తయారవుతాయి. సుమారు 8000 టపాసుల పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఉపాధి పొందేవారు 4 లక్షలపైనే. చైనాలో 2007లో 13 కిలోమీటర్ల పొడవునా టపాసులను పరిచి కాల్చారు. ఇందుకోసం పది లక్షల డాలర్లని ఖర్చుపెట్టారు. అలాంటి బాణసంచా  పుట్టింది మాత్రం  చైనాలో అని చెపుతారు. అయితే దీపావళి పండుగ రోజున మహారాష్ట్రలో యముడికి పూజలు చేసే సంప్రదాయం ఉంది. 


రాజస్థాన్ విషయానికి వస్తే.. పిల్లికి మొక్కుతారు. మనం పిల్లి ఎదురొస్తే అశుభమని కంగారు పడతాం. కానీ రాజస్థాన్‌లో పిల్లిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి పిల్లులకు పెడతారు. దీపావళి పండుగను బెంగాల్లో మహానిష అని పిలుస్తారు. కాళికా దేవిని పూజిస్తారు. బీహార్‌ గ్రామాల్లో యువకులు ధాన్యం, గడ్డిలను ఒక గంపలో వేసుకుని ఊరంతా తిరుగుతారు.
ఇతర దేశాల విషయానికి వస్తే..మాల్టా మక్బాలో 2011 జూన్‌లో అతి పెద్ద విష్ణు చక్రాన్ని కాల్చి రికార్డు సృషించారు. దీని చుట్టు కొలత 105 అడుగులు. ఫిలిప్పీన్స్‌లో గతేడాది 30 సెకన్లలో 1,25,801 తారాజువ్వల్ని వెలిగించడం గిన్నిస్‌ రికార్డు.



ఇంగ్లండ్‌లో 2009లో 6.5 సెకన్లలో 1,10,000 రకాల బాణసంచా కాల్చారు. జపాన్‌లో అతి పెద్ద చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసం, 750 కిలోలతో తయారు చేశారు. సింగపూర్‌, మలేషియాలో అధికారిక సెలవు దినం. అమెరికా అధ్యక్ష భవనంలో కూడా దీపావళి పండగను చేస్తారు. వేడుకల్లో పాల్గొన్న తొలి అధ్యక్షుడు బరాక్‌ ఒబామానే అన్న విషయం తెలుసా. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు దీపావళి రోజునే నిర్యాణం చెందినట్టు చెబుతారు. ఆయన జ్ఞాపకార్థం జైనులు ఈరోజు ప్రార్థనలు చేస్తారు. ఆలా భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలకు చెందినవారంతా వెలుగులు విరజిమ్మే దీపావళిని వేడుకగా జరుపుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: