ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఏపీ లో భవన నిర్మాణ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే కార్మికులకు...  గత ఐదు నెలలుగా ఇసుక కొరతతో పనులు దొరకటంలేదు.ఇసుక లేకపోవడంతో పనులు లేకుండా పోయాయి.ఇప్పటిదాకా వరకు రైతుల ఆత్మహత్యలు చూసిన రాష్ట్రంలో కొత్తగా జగన్‌ సర్కారు అసమర్థ పాలన వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. 


దీంతో ఈ మధ్య ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల అప్పులపాలై...వాటిని తీర్చలేక, కొత్తగా అప్పులు పుట్టక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ  ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక కొరతను సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందని, దీనివల్ల లక్షల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని, భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు.

బ్రహ్మాజీ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. ఆత్మహత్య చేసుకున్న నాగ బ్రహ్మాజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ... మేస్త్రి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.
నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఏపీలోని భవన నిర్మాణ రంగ కార్మికుల దుస్థితికి అద్దంపడుతోందని అన్నారు. 

ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్థ ఇసుక విధానం కారణంగా.. రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా.. మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ ఆవేదన చెందారు.ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు దుర్భర జీవనాన్ని గడుపుతున్నాయని అన్నారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: