ప్రస్తుతం ఇండియా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది.  అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నా.. పర్యాటక రంగంలో మాత్రం ఇండియా కాస్తంత వెనుకబడి ఉన్నది.  కారణం ఏంటి అంటే.. ఇండియాలో చెప్పుకోదగ్గ పర్యటన కేంద్రాలు లేవని కొంతమంది ఉవాచ.  కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే.. ఇండియాలో ఎన్నో వందల పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.  ప్రతి పర్యాటక కేంద్రం ఆకర్షించే విధంగా ఉంటుంది. 


మనదేశంలో ఎక్కువ మంది ఆగ్రాలోని తాజ్ మహల్, జమ్మూ కాశ్మీర్, షిమ్లా, తమిళనాడులోని దేవాలయాలు చూసేందుకు వస్తుంటారు.  కాగా, ఇప్పుడు గుజరాత్ ను కూడా ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నారు.  గుజరాత్ లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కు సమీపంలో స్టాట్యూ అఫ్ యూనిటీ పేరుతో వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.  అమెరికా వెళ్ళినపుడు ఎలాగైతే లిబర్టీ విగ్రహాన్ని సందరిస్తారో.. ఫ్రాన్స్ వెళ్ళినపుడు ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ ను ఎలాగైతే సందర్శిస్తారో.. అలానే ఇండియా వచ్చినపుడు తప్పకుండా ప్రతి ఒక్కరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  


స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం యూఎస్ లిబర్టీకి సంబంధించి నిర్మించారు.  అయితే, గుజరాత్ లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం మాత్రం భారతదేశం యూనిటీకి గుర్తుగా నిర్మించారు.  స్వాతంత్ర కాలానికి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి.  సంవత్సరం కాలంలో ఆ విగ్రహాన్ని 25 లక్షల మంది సందర్శించారు.  ఈ ఏడాది ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  


సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తున్నారు.  పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  ప్రముఖ టూర్ కంపెనీలు తమ టూర్ ప్యాకేజీలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని కూడా చేరుస్తున్నాయి.  స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు.  పర్యాటకంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ మారితే విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: