తమిళనాట ఏదైనా ప్రత్యేకంగానే ఉంటుంది. అక్కడి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్న కఠినంగానే అనిపిస్తుంది. ఈ క్రమంలోనే కేవలం రెండు గంటల పాటు పండగ చేసుకోవాలని నిర్ణయించారు. అసలేం జరిగిందంటే.. తమిళనాట దీపావళి సంబరాలు మొదలయ్యాయి. చెన్నై ప్రజలు పొద్దున్నే టపాసుల మోత మోగించారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి బాణాసంచా కాల్చారు. దీపావళి రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు టపాసులు కాల్చాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల్లో భాగంగానే ఉదయం టపాసులను పేల్చారు.
  

రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సడలించాలని.. ఉదయం కూడా టపాసులు పేల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని తమిళనాడు ప్రభుత్వం కోరింది. దీంతో కోర్టు తన తీర్పును సడలిస్తూ.. ఏదైనా రెండు గంటల్లో టపాసులు పేల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి దీపావళి పండుగ సంబారాకు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అసలు చెప్పాలంటే తమిళనాడులోని శివకాశి నుంచి 90 శాతం బాణసంచా సరంజామా తెలుగు రాష్ట్రాలకు వస్తుంది. అక్కడ పెద్దఎత్తున కొనుగోలు చేసి ఆయా రాష్ట్రాల్లో  అమ్మకాలు సాగిస్తుంటారు. ముఖ్యంగా పళ్లిపట్టు నుంచి ఈ సామగ్రి భారీగా తరలివస్తుంది. ఇందుకు అవసరమైన గోదాములు సైతం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి.



  ఇదిలా ఉంటే..క్రయ విక్రయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ లోడు టపాసులను రూ.10లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తే, వాటిపై ముద్రించిన గరిష్ఠ ధరను లెక్కిస్తే రూ.కోటి వరకు ఉంటుంది. రూ.10లక్షలకు సరకును కొన్నా, బిల్లు మాత్రం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు వేయించుకుంటారు. అంటే అయిదు శాతానికి కొనుగోలు చేసినట్లు లెక్క. ఇక రూ.5లక్షలకు 18శాతం చొప్పున రూ.90 వేలు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ లెక్కన రాష్ట్రాల్లో ఏటా సుమారు రూ.1500కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. దీనికి పన్ను సుమారు రూ.270కోట్ల మేర పన్ను వసూలు కావాలి. అయినా అందులో నాలుగో వంతయినా వసూలు కావడం లేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నట్టుగా కధనాలు   సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: