భారత ప్రధాని మోడీ రియల్ హీరో అని ఎప్పుడు నిరూపిస్తూ ఉంటారు. పండగలు పబ్బాలు మాని, ఇల్లు వాకిలి వదిలి దేశ ప్రజలకోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు దీపావళి కానుకను అందించిరు మోడీ. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసిన అనంతరం తొలిసారి ఈ ప్రాంతంలో పర్యటించారు మోదీ.


దీపావళి వేడుకలను భారత సైనికులతో జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్దగల ఆర్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని సైనికులకు మిఠాయిలు అందజేసి  దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్క సైనికుడి నోటికి మిఠాయిలను మోడీ పెడుతూ అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు.జవాన్లకు షాక్ హ్యాండ్ ఇస్తూ అందరితో చిరునవ్వులు చిందించారు.

మోడీ మిఠాయిలు పంచుతుండగా అందరు భారత్ మాతాకీ  జై అంటూ జయ జయ ద్వానాలు చేశారు. అనంతరం జవన్లను ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దులోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ డ్రెస్ లో మోడీ ఒక వీర సైనికుడి మాదిరి ఉన్నారు.జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పహారా కాస్తున్న జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధానమంత్రి. జవాన్లకు స్వీట్లు పంచుతున్న వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.1947లో భారత బలగాలు జమ్ముకశ్మీర్లో తొలిసారి అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించే 'పదాతిదళ రోజు' వేడుకల్లో పాల్గొన్నారు మోదీ.


 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు జమ్ముకశ్మీర్కు మోదీ రావటం ఇది మూడోసారి.గతేడాది ఉత్తరాఖండ్‌లోని భారత్‌-చైనా సరిహద్దులో ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో ప్రధాని దీపావళి జరుపుకున్నారు.2014లో సియాచిన్‌లో, 2015లో పంజాబ్‌ బోర్డర్‌లో, 2016లో హిమాచల్‌లో భద్రతా సిబ్బందితో దీపావళి పండుగను చేసుకున్నారు. 2017లో కశ్మీర్‌లోని గురెజ్‌లో జవాన్లతో కలిసి పండుగను జరుపుకున్నారు. 2020లో దీపావళి వేడుకల కోసం హిమాచల్ ప్రదేశ్లోని ఐటీబీపీ శిబిరానికి వెళ్లనున్నారు మోదీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: