సామ్నా అంటే మనకు గుర్తుకు వచ్చేది శివసేన పార్టీ.  శివసేన అధికారిక పత్రిక సామ్నా.  బాల్ థాకరే హయాంలో ఇది ప్రారంభం అయ్యింది. ఆయన ఓ మంచి కార్టూనిస్ట్. అందుకే ఈ పత్రికలో కార్టూన్లు అద్భుతంగా ఉంటాయి.   ఇక అందులో రాసే వ్యాసం కోసం ప్రతి ఒక్కరు ఆతృతగా ఎదురు చూస్తుంటారు.  కారణం ఏంటి అంటే.. అందులో వచ్చే వ్యాసాలు చాలా విపులంగా, కొన్నిసార్లు వ్యగ్యంగా, కొన్నిసార్లు విమర్శలు పాలయ్యే  విధంగా ఉంటాయి.  


అయితే, ఇప్పుడు సామ్నా పత్రిక ఓ కార్టూన్ ను ప్రచురించింది.  పులి చేతిలో కమలం.  దీని అర్ధం ఏంటో తెలుసా.. మహారాష్ట్రలో శివసేన పార్టీ చక్రం తిప్పే రోజులు వచ్చాయి.  కమలం నీడలో శివసేన లేదు.  శివసేనకు  ప్రత్యేక బలం ఉంది.  ఆ బలంతో ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం.  తమ డిమాండ్లు ఒప్పుకోవాల్సిందే అని అంటోంది.  ఇంతకీ డిమాండ్లు ఏమంటే, మహారాష్ట్రలో శివసేన పార్టీకి 50-50 పదవులు ఇవ్వాలి.  ఇక ముఖ్యమంత్రి పదవిని సైతం రెండేళ్లు బీజేపీ, రెండేళ్లు శివసేనకు ఇవ్వాలి.  ఆ విధంగా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వగలిగితే.. తప్పకుండా మద్దతు ఇస్తామని అంటోంది. 


ఎన్నికలకు ముందు పొత్తు వద్దు వంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందని అధిష్టానం చెప్పినా.. ఫడ్నావిస్ మాత్రం వినకుండా శివసేనతోనే కలిసి వెళ్ళాలి అన్నారు.  చివరకు ఏమైంది.. ఏకు మేకులా మారింది.  కమలం మెడకు బాంబును చుట్టి.. చేతిలో రిమోట్ పట్టుకుంది.  కమలం లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే మద్దతు ఇస్తామని అంటోంది.  రాజకీయం కదా.. ఏదైనా చెయ్యొచ్చు.  గతంలో అంటే థాకరే కుటుంబం డైరెక్ట్ గా పోటీ చేయలేదు. కానీ, ఇప్పుడు థాకరే కుటుంబం నుంచి ఆదిత్య థాకరే పోటీలో నిలబడ్డాడు.  


అది ఇప్పుడు ఆ పార్టీకి బలాన్ని ఇచ్చింది.  బలం అని చెప్పలేముగాని, కీ రోల్ పోషించడానికి ఆ పార్టీకి అవకాశం దొరికింది.  అవకాశం కోసమే కదా ఎవరైనా ఎదురుచూసేది.  కాకపోతే బాల్ థాకరే విలువలకు కట్టుబడి ఉన్నాడు.  తన ఉద్దేశ్యం పార్టీని రాజకీయాల్లో ఉంచాలనేగాని, తాను రాజకీయాల్లోకి వెళ్లాలని కాదు.  రాజకీయాల్లోకి వెళ్లాలని థాకరే అనుకుంటే ఎప్పుడో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయ్యేవాడు.  కానీ అయన అలా చేయలేదు.  తరం మారింది.. ఆలోచనలు మారాయి.  ఇప్పుడు థాకరే ఫ్యామిలీ నుంచి ఆదిత్య థాకరే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు.  మహారాష్ట్ర పొలిటికల్ బాల్ ఇప్పుడు శివసేన చేతిలో ఉన్నది.  ఏం చేస్తుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: