కొన్ని కొన్ని విచిత్రాలు భలే తమాషాగా ఉంటాయి. విచిత్రం అంటేనే తమాషాగా ఉంటుంది. ఒక్కోసారి భయకంగా కూడా ఉంటుంది.  విచిత్రం అని మనకు అనిపిస్తుంది.  కానీ, ఆ విచిత్రం జరిగే సమయంలో ఏర్పడే సంఘటనలు తలచుకుంటే మాత్రం భయం వేస్తుంది.  ఒక్కోసారి అవి చాలా భయంకరంగా ఉంటాయి.  ఏ చిన్న పొరపాటు జరిగినా దాని వలన జరిగే అనర్ధాలు తీవ్రంగా ఉంటాయి.  అలాంటి విచిత్రం ఒకటి ఇటీవలే జరిగింది.  


ఇంతకీ ఆ విచిత్రం ఏమిటంటారా.. అక్కడికే వస్తున్నా.. మాములుగా కుక్కలను బైక్ ముందు కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తుంటారు.  కార్లలో కావొచ్చు.  బండిమీద కావొచ్చు.  అదే కుక్క బండి ముందు కూర్చొని బైక్ నడుపుతుంటే ఎలా ఉంటుంది.  ఆగండి.. ఏమంటున్నారు.. కుక్క బండి తోలడమా...ఇదేం విచిత్రం.. మేము నమ్మం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు.  నమ్మినా నమ్ముకున్నా ఇది నిజం.  దీనికి సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  అలా పోస్ట్ అయినా కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది.  


ఇక ఆ కుక్క వెనకాల ఒక్కరు కాదు ఐదారు కూర్చొని ఉన్నారు.  అంటే త్రిబుల్ రైడింగ్.  వెనక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ పెట్టుకున్నారు.  కానీ డ్రైవింగ్ చేస్తున్న కుక్కగారు మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు.  గాలి వేగంగా వేస్తోంది.  అలా గాలి వేగంగా వీచే సమయంలో కుక్క ముందరి కాళ్ళు ఏమైనా పక్కకు జరిగితే.. ఇక అంతే... బండిమీద వెళ్తున్న ముగ్గురు కిందపడిపోవాల్సి వస్తుంది.  దెబ్బలు తగులుతాయి.  


దెబ్బలు తగిలితే ఏదోలా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ప్రాణం పొతే ఇంకేమైనా ఉన్నదా చెప్పండి.  ఎందుకు అలా చేయడం చేయడం అంటే.. అంతే అదో సరదా.  ఆ సరదా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.  అయితే, ఈ సంఘటన బ్రెజిల్ లో జరిగింది.  ఇదే సంఘటన ఇండియాలో జరిగి ఉంటె.. తప్పకుండా ఆ కుక్కగారికి కొత్త వాహన చట్టం ప్రకారం ఫైన్ వేసేవాళ్ళు.  డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు ఐదువేలు ఫైన్ పడేది.  బయటిదేశంలో కాబట్టి బతికిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: