ఇపుడిదే చర్చ తెలుగుదేశంపార్టీలో జోరుగా జరుగుతోంది. జిల్లాలోని కీలక నేతతో గన్నవరం ఎంఎల్ఏలకి చాలా కాలంగా పడటం లేదన్న విషయం చంద్రబాబునాయుడుతో సహా అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నపుడే వంశీకి దేవినేని ఉమకు మధ్య చాలా గొడవలే అయ్యాయి. అయితే పంచాయితి ఎప్పుడు చంద్రబాబు ముందుకొచ్చినా దేవినేనిదే పై చేయి అయ్యేది.

 

సరే అధికారం ముచ్చట అయిపోయిన తర్వాత కూడా వాళ్ళమధ్య పంచాయితీలు జరుగుతునే ఉన్నాయట. దేవినేనితో పడకపోవటం వల్లే ఒకదశలో ఎంఎల్ఏ పార్టీ కూడా మారాలని అనుకున్నారట. అయితే అప్పట్లో పార్టీలోని కొందరు సన్నిహితుల కారణంగానే పార్టీ మారే నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే ప్రతి విషయంలోను ఎంఎల్ఏపై దేవినేని ఆధిక్యత కంటిన్యు అవుతోంది. ఈ నేపధ్యంలోనే  పార్టీ గూబగుయ్యిమనిపించారు జనాలు.

 

మొన్నటి ఎన్నికల్లో మైలవరంలో దేవినేని ఓడిపోగా గన్నవరంలో వంశీ గెలిచారు. దాంతో ఇద్దరి మధ్య వైరం మరింతగా పెరిగింది. చంద్రబాబు, చినబాబు అండ చూసుకుని మాజీమంత్రి ఎంఎల్ఏను పార్టీపరంగా అణగదొక్కేస్తున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. దేవినేనితో సమస్యలు, చంద్రబాబు పట్టించుకోకపోవటం లాంటి అనేక కారణాలతో పార్టీలో ఎంఎల్ఏ బాగా సఫకేషన్ ఫీలవుతున్నారట.

 

ఇదే అదునుగా కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి పావులు కదపటం మొదలుపెట్టారు. సుజనా, వంశీ ఇద్దరు దగ్గర బంధువులే కావటంతో పాటు మొన్ననే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించటంతో సుజనాకు పార్టీలోని అన్నీ విషయాలు తెలిసినవే. అందుకనే ఎంఎల్ఏను బిజెపిలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తాను బిజెపిలోకి ఫిరాయిస్తే అనర్హత వేటు పడుతుందన్న విషయం ఎంఎల్ఏకి బాగా తెలుసు.

 

అనర్హత తర్వాత జరిగే ఉపఎన్నికలో గెలుపంటే అంతా ధైవాదీనమే. వైసిపిని తట్టుకుని బిజెపి అభ్యర్ధిగా గెలవటమన్నది కలలోని మాటే. దాంతో ఏం చేయాలో పాలుపోని స్ధితిలో వంశీకి అత్యంత సన్నిహితుడైన మంత్రి కొడాలినాని రంగం ప్రవేశం చేశారు. కొడాలి చొరవతోనే వంశీ చివరకు జగన్మోహన్ రెడ్డితో భేటి అయ్యారు. వంశీ గనుక పార్టీతో పాటు ఎంఎల్ఏగా కూడా  రాజీనామా చేస్తే పొగపెడతున్నదెవరో ఈ పాటికే అర్ధమైపోయుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: