దీపావళి పండుగ ముందు బంగారం కొనడం సంప్రదాయంగా వస్తూ ఉంది. అయితే ఈ సారి బంగారు కొనుగోళ్లు బాగానే జరుగుతాయి అని అనుకున్నారు అంతా. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ బంగారు కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయి. ప్రతి ఏడాది దీపావళి నాడు కళకళలాడే బంగారు షాపులు ఈ సారి మాత్రం గిరాకీ లేక షాపులన్నీ వెలవెలబోయాయి. ఈ సీజన్లో గత ఏడాది 40 టన్నులు జరిగిన బంగారం ఇప్పుడు మాత్రం కేవలం 20 టన్నులు మాత్రమే జరిగిందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.

అసలు ఈ ఏడాది పసిడికి ఏ మాత్రం గిరాకీ లేదన్నారు.  అసలు బంగారం వైపు కొనుగోలుదారులు మొగ్గుచూపట్లేదు అని అన్నారు. గత ఏడాది కి ఇప్పటికి  దాదాపు గా 25 % శాతం తగ్గింది అని వారి మాట. ఆర్థికమాంద్యం వల్ల బంగారు రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల కూడా దీనికి కారణం అయ్యుంటుంది. మోడీ ప్రభుత్వం వరుసగా రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత దేశం విపరీతమైన ఆర్ధిక మాంద్యంలోకి కూరుకొని పోయిన సంగతి తెలిసిందే.

ఆర్థికమాంద్యం దెబ్బకు ప్రజల దగ్గర కూడా నగదు లభ్యత లేకపోవడం బంగారం రేట్లు ఆకాశాన్ని అంటడంతో మార్కెట్ లో బంగారం డిమాండ్ బాగా పడిపోయింది. ఇక అదీ కాక భారత్ బంగారు పై సుంకాన్ని 10 నుంచి 12.5 % శాతానికి పెంచడం కూడా ఒక కారణం అని నిపుణులు వెల్లడించారు.  మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 38275 గా ఉంది. ఇదే రోజున బంగారం ధర 31702 రూపాయిలు గా ఉండడం గమనార్హం. ఈ ధరలే ప్రజలను బంగారం వైపు మొగ్గుచూపకుండా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: