ఎవరైనా కూడా దీపావళికి ఏదోకటి కొనాలనుకుంటాఋ.. కానీ కొందరు కొన్న విధానాలే వార్తల్లోకి వచ్చేలా చేస్తాయి. ఇంకా విషయానికి వస్తే ఓ వ్యక్తి దీపావళి సందర్బంగా ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలి అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి ఎంతో అవసరమైన వాటిలో రోజు తిరగతినికి కావాల్సింది బండి. 

           

అయితే అలానే బండి కోసం షాప్ కి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి హోండా యాక్టివా 125 బండిని 83 వేలకు కొన్నాడు. ఇందులో ఏముంది విశేషం.. అందరూ చేసేదే అతను చేశాడు అని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.. ఆ వ్యక్తి 83 వేలు పెట్టి కొన్న బండిని కరెన్సీ నోట్లతో కాకుండా చిల్లర నాణేల రూపంలో చెల్లించాడు.

          

దీంతో అక్కడ ఉన్న షోరూం సిబ్బంది అంత ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగింది. రాకేశ్ కుమార్‌ గుప్తా అనే వ్యక్తి ముచ్చటపడి బండి కొనాలనుకున్నాడు. అందుకే స్థానిక హోండా డీలర్‌షిప్‌ నుంచి బండి కొనుగోలు చేశాడు. మొత్తం డబ్బులను కరెన్సీ నోట్లతో చెల్లించకుండా రూ. 83వేల విలువ గల నాణేలు చెల్లించారు.

         

అయితే 83 వేల విలువ గల నాణేలలో ఎక్కువగా రూ.5, రూ. 10 నాణేలు ఉన్నాయి. ఇది అంత చూసి ఆశ్యర్యపోయిన డీలర్‌షిప్‌ సిబ్బంది 3 గంటలకుపైగా శ్రమించి నాణేలను లెక్కించారు. అంతమొత్తాన్ని రాకేష్ ఎందుకు నాణేలు రూపంలో చెల్లించారు ఇంతవరుకు తెలియరాలేదు.. ఏమైతేనేం నాణేలు చెల్లించి వార్తల్లోకి ఎక్కాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు అన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. 

            

మరింత సమాచారం తెలుసుకోండి: