ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో చిత్ర విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. అనుకోని రీతిలో రాజకీయనాయకుల స్పందనలు ఉన్నాయి. ఒక పక్క పర్చూరులో గొడవలు.. మరో పక్క వల్లభనేని గొడవ.. ఇంకా విషయానికి వస్తే.. అనూహ్య పరిణామాల మధ్య నేడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి విదితమే.       

                  

ఈ నేపథ్యంలోనే వల్లభనేని అతని రాజీనామా లేఖను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. అయితే ఈ రాజీనామా లేఖపై చంద్రబాబు తాజాగా విచిత్రంగా స్పందించారు. వల్లభనేని వంశి రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలప చంద్రబాబు తిరిగి లేఖ రూపంలో స్పందించారు. 

                

ఆ లేఖలో చంద్రబాబు ఇలా రాశారు.. ''వైసీపీ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారుల వల్ల ఎమ్మెల్యే ఆయినా మీరు రాజీనామా చేయడం సబబు కాదని, ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి పోరాడాలని.. మీపై పెట్టిన కేసులన్నీ దురుద్దేశంతో కూడినవని చెప్పారు. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమి కాదు అని అన్నారు. 

                    

పదవికి రాజీనామా చేయడం లేదా రాజకీయాల నుంచి నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ నాయకుల వైఖరిపై ఎంతవరకైనా పోరాడదాం అని పిలుపునిచ్చారు. రాజకీయాల నుంచి వైదొలగడం వల్ల ఇలాంటివి ఆగవని.. పార్టీ మొత్తం మీకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు'. దీంతో ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

                 


మరింత సమాచారం తెలుసుకోండి: