పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలాకాలంగా ఉంటున్నా రాజకీయం తెలియని నాయకుడు. ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వారు. పూర్తిగా ఆవేశపూరితమైన రాజకీయం మాత్రమే చేస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ, అధికారంలో ఉన్న వైసీపీ కానీ  రాజకీయాల్లో పూర్తిగా ఆరితేరిపోయిన పార్టీలు. ఇక పవన్ వైసీపీని విమర్శిస్తూ టీడీపీకి అనుకూలం అనిపించుకున్నారు. కానీ ఆయన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటోంది పసుపు పార్టీ అంటున్నారు.


నిజానికి ఏపీలో ప్రతిపక్షంగా టీడీపీ విఫలం అయింది. రాజధాని సమస్య కానీ, ఇసుక కొరత కానీ పవన్ ముందు లేవనెత్తుతున్న ఆందోళనలే.  పవన్ రాజధాని మార్పు సమయంలో అమరావతి వెళ్లి వచ్చారు. అది టీడీపీ స్పాన్సర్ చేసిందని చెప్పినా కూడా మైలేజ్ వచ్చింది మాత్రం పవన్ కే. ఇక ఇపుడు ఇసుక కొరత విషయంలో పవన్ లాంగ్ మార్చ్ పేరిట భారీ  ఆందోళనకు పిలుపు ఇచ్చారు. నవంబర్ 3న ఆయన విశాఖ వేదికగా ఆ ఆందోళనను చేపట్టనున్నారు. సహజంగా పవన్ కి ఉన్న సినీ క్రేజ్, యూత్ ఫాలోయింగ్ వల్ల లాంగ్ మార్చ్ సక్సెస్ అవుతుందనండంలో సందేహం లేదు. సరిగ్గా ఈ పాయింటే ఇపుడు టీడీపీని ఇరకాటంలో పెడుతోందట. పవన్ కి పేరు వస్తే ఆయనే బలమైన ప్రతిపక్ష నేతగా మారుతారు.


ఫార్టీ యియర్స్ నేత అనుభవంలోని టీడీపీ బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోతుంది. దాంతో సిక్కోలు టూర్లో నే చంద్రబాబు ఈ నెల 25న ఇసుక కొరత పై పోరాటాలు ఎక్కడికక్కడ చేయమని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఆ విధంగా పవన్ కంటే ముందే తాము ఆందోళనలు చేశామని చెప్పడానికి టీడీపీ జిమ్మిక్ చేసింది. ఇక పవన్ పదిహేను రోజుల క్రితం ప్రకటించి వచ్చే వారం ఆందోళన‌ చేపట్టనున్నారు. అయితే పవన్ కంటే ముందు అన్న పాయింట్ తో క్రెడిట్  కొట్టాలని టీడీపీ చూస్తోంది. బాగానే ఉంది కానీ పవన్ పిలుపు ఇచ్చే వరకూ అనుభవం కలిగిన పార్టీ టీడీపీకి ఎందుకు తట్టలేదు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటికైనా పవన్ జాగ్రత్తగా తన ఆందోళనలు, , ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోకపోతే టీడీపీ హై జాక్ చేసే ప్రమాదం పొంచి ఉంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: