గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దీపావళి రోజు బాంబులాంటి వార్త పేల్చారు. టీడీపీ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచే వైదొలుగుతున్నానని ప్రకటించారు. అంతా వైసీపీలో చేరతారని భావిస్తే.. ఆ విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామా లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబుకు రియాక్టయ్యారు. రాజీనామాలేఖలో వంశీ ప్రస్తావించిన‌ అంశాలను ఉదహరిస్తూ చంద్రబాబు మళ్లీ వంశీకి లేఖ రాశారు. వాట్సాప్ ద్వారా పంపిన మీ లేఖను అందుకున్నానని.. కంటెంట్ కూడా చదివానని చంద్రబాబు లేఖలో చెప్పారు.


వైసీపీ నాయకులు మరియు కొంతమంది ప్రభుత్వ అధికారుల వల్ల రాజీనామా చేయడం సరికాదని చంద్రబాబు తెలిపారు. ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి పోరాడాలని సూచించారు. వంశీపై పెట్టిన కేసు దురుద్దేశంతో కూడినదన్నారు. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదన్నారు. దీని ప్రకారం టీడీపీ ప్రభుత్వం పేద, బలహీన, బలహీన వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిందని గుర్తు చేశారు.


రాజీనామా చేసినంత మాత్రాన వైసీపీ ప్రతీకార రాజకీయ చర్యలను ఆపబోదని చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలలో అవగాహన కలిగించడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటం నాయకుల బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రస్తుత ప్రభుత్వం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఈ పోరాటంలో వ్యక్తిగతంగా.. పార్టీ తరపున అండగా నిలబడతా’మని చంద్రబాబు తెలిపారు. వంశీపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను ప్రస్తుత ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వేధిస్తోందని చంద్రబాబు అన్నారు. వైసీపీ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొంటామన్నారు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: