తమిళనాడులో బోరుబావిలో పడ్డ సుజిత్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా... అవేవీ సఫలం కావడం లేదు. ప్రతికూల వాతావరణం కూడా ఆపరేషన్ కు అడ్డంకిగా మారింది. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు మొత్తం ప్రార్థనలు జరుగుతున్నాయి. రజనీ సహా కోలీవుడ్ స్టార్లందరూ సుజిత్ క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. 


తమిళనాడులో వంద అడుగుల పైనే ఉన్న ఓ బోరుబావిలో రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ పడిపోయాడు. శుక్రవారం సాయంత్రం బాలుడు పడిపోతే.. అప్పట్నుంచీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సుజిత్ విల్సన్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తమిళనాడు మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రే ఫర్ సుజిత్, సేవ్ సుజిత్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాకు కుదిపేస్తోంది. కంటి మీద కునుకు లేకుండా అధికార యంత్రాంగం సుజిత్ ను సజీవంగా వెలికి తీయడానికి శ్రమిస్తోంది. 


శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో తన తండ్రికి చెందిన మొక్క జొన్న పొలంలో ఆడుకుంటూ దురదృష్టవశావత్తూ సుజిత్ బోరుబావిలో పడిపోయాడు. తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి తవ్వించి ఖాళీగా వదిలేసిన బోరుబావిలోనే కుమారుడు పడటం.. ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. ప్రారంభంలో 25 అడుగుల లోతులో సుజిత్ చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 60 అడుగుల కిందికి చేరుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచి బాలుడి నుంచి కదలికలు లేవనే విషయం అందర్నీ కలిచి వేస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా ఈ ఘటన పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. సుజిత్ ప్రాణాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు. 


ఈ ఘటనపై తమిళనాడు చిత్ర పరిశ్రమ స్పందించింది. రజినీకాంత్ కుమార్తె సౌందర్య, విశాల్, కార్తి, అజిత్ తదితరులు సేవ్ సుజిత్, ప్రే ఫర్ సుజిత్ హ్యాష్ ట్యాగ్ లతో తమ సందేశాలను వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడి మీదికి రాకెట్లను పంపుతున్నాం గాని... భూమిలో ఓ 20 అడుగుల లోతున చిక్కుకున్న చిన్నారులను కాపాడలేకపోతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు స్టార్స్‌. ప్రమాదవశాత్తు బోరు బావుల్లో పడిపోతున్న చిన్నారుల్ని రక్షించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: