ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి... వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ... వాటికి వ్యతిరేకంగా పోరాడుతామని టీడీపీ  చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రతి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న టిడిపి పార్టీ ఇప్పుడిప్పుడే... వైసీపీ పై సరిగ్గా పోరాడుతున్నామని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో... టిడిపికి తన సొంత గూటిని సెట్  చేసుకోవడం చాలా తలనొప్పిగా మారింది . ముఖ్యంగా టిడిపి పార్టీలో ముఖ్య నేతగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీలో కాన్ఫిడెన్స్  దెబ్బతీసేలా గా ఉంది అని చంద్రబాబు భావిస్తున్నారట . అయితే వల్లభనేని వంశీని ఆపడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మొత్తం వేస్ట్ అయిపోయింది. 

 

 

 

 గతంలో టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి 23మంది వైసిపి పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ పిరాయింపులకు  ప్రోత్సహించారు టీడీపీ అధినేత చంద్రబాబు . అయితే ఆ తప్పు తాము  చేయకూడదని భావించిన వైసిపి... ఏ నేతలైన సరే ఉన్న పార్టీకి రాజీనామా చేస్తేనే  తమ పార్టీలో చేర్చుకుంటామని కండిషన్ పెట్టింది. దీంతో తాజాగా ఎలక్షన్లు తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి రాగా... అనుకున్నంత వేగంగా మాత్రం పార్టీ ఫిరాయింపులు జరగలేదు. అయితే ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైకిల్ దిగి  ఫ్యాన్ కిందకి  వచ్చేయడంతో టిడిపి అధినేత చంద్రబాబులో  ఆందోళన మొదలైనట్లు కనిపిస్తుంది. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల  పర్వం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. 

 

 

 

 అయితే మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్బై చెప్ప కుండా చంద్రబాబు ఇవాళ కీలక సమావేశం  పెట్టనున్నారు. ఈ సమావేశంలో మిగతా ఎమ్మెల్యేలను  కాపాడుకునేందుకు కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాష్ట్రంలో పరిస్థితులు వైసిపి పై పోరాటం వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనుండగా... వంశీ విషయంపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత టీడీపీ  నుంచి తొలి వికెట్ పడ్డట్లయింది. కాక రాబోయే రోజుల్లో  ఇంకెంత  మంది  చంద్రబాబు కు షాక్ ఇచ్చి టీడీపీ కి గుడ్ బై చెప్తారో అన్న  టెన్షన్ టిడిపి వర్గాల్లో మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: