గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి నిన్న సాయంత్రం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వంశీ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. లేఖలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల తరువాత అనేక సమస్యలు చుట్టుముట్టాయని వంశీ లేఖలో పేర్కొన్నారు. రాజకీయంగా వేధిస్తున్నారని, అనుచరులపై కేసులు పెడుతున్నారని వంశీ లేఖలో పేర్కొన్నారు. తన వలనే అనుచరులకు ఇబ్బందులు పెరుగుతున్నాయని వంశీ లేఖలో పేర్కొన్నారు. 
 
 చంద్రబాబు లేఖ ద్వారా వంశీ ప్రజల ప్రయోజనాల కొరకు పోరాడాలని సూచించారు. రాజీనామా చేయటం సరైన పరిష్కారం కాదని చంద్రబాబు లేఖలో అభిప్రాయపడ్డారు. పార్టీ తరపున మరియు వ్యక్తిగతంగా అండగా నిలబడతామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రాసిన లేఖ గురించి వంశీ స్పందించారు. కనపడే శత్రువుతో యుద్ధం చేయటం చాలా తేలికని కనపడని శత్రువుతో యుద్ధం చేయటం చాలా కష్టమని వంశీ లేఖలో పేర్కొన్నారు. 
 
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ నుండి తప్పుకోవాలని ఒత్తిడి వచ్చిందని అయినా వెనక్కి తగ్గలేదని వంశీ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా తొలిసారి విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేశానని కానీ ఓడిపోయానని, 2019 ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు తనపై ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసని ఈ విషయాన్ని ఇంకా పొడిగించనని వంశీ లేఖలో పేర్కొన్నారు. 
 
వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని భావించవచ్చు. కొన్నిరోజుల నుండి వంశీ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. వంశీ సీఎం జగన్ తో సమావేశమై నకిలీ ఇళ్ల పట్టాల కేసులు, నియోజకవర్గాల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వంశీ వైసీపీ పార్టీలో చేరతారని అనుకున్న సమయంలో రాజకీయాల నుండి తప్పుకుని వంశీ షాక్ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: