చాలామంది సినిమా హీరోయిన్లు హీరోలు ఎలాంటి కష్టం లేకుండా సినిమాల్లో  బాగా సంపాదిస్తున్నారు అని అనుకుంటారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే సినిమా హీరోలు హీరోయిన్లు షూటింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు అన్న  విషయం తెలుసు. షూటింగ్ చేస్తున్నప్పుడు నటులకి చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా తమ మైండ్ ప్రస్టేషన్ పక్కన పెట్టి నటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా షూటింగ్ దగ్గరికి వచ్చిన ప్రేక్షకుల నుండి  కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి నటీనటులకు . ఇక్కడ ఓ  హీరోయిన్ కి షూటింగ్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడలేదు కానీ తన ప్రేమికుడు పెట్టిన టార్చర్  కారణంగా షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. 

 

 

 చెన్నైలో ఈ ఘటన జరిగింది ఆరురాజా  స్వయంగా దర్శకత్వం వహిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం బాబిలోన్ . అయితే ఈ చిత్రానికి కథా నాయికగా మొదట ఓ నటి ని సెలెక్ట్ చేసింది చిత్రబందం . అయితే సినిమా షూటింగ్లో రెండు రోజులు బాగానే పాల్గొన్న ఆ నటి... రెండు రోజుల తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేదని... షూటింగ్ క్యాన్సల్ చేసుకొని సినిమా నుంచి తప్పుకుందట . అయితే ఆ హీరోయిన్ నిజంగానే తన తల్లి ఆరోగ్యం బాగాలేక... షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని తమ సినిమా నుంచి తప్పుకున్నట్లు భావించామని ఆరురాజా తెలిపారు. కానీ తమకు  తర్వాత  ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందని తెలిపారు. 

 

 

 

బాబిలోన్  చిత్ర బృందం  సెలెక్ట్ చేసిన హీరోయిన్ తన ప్రియుడి టార్చర్ భరించలేక షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసి ఆశ్చర్యపోయాం అని  ఆరురాజా తెలిపారు . దీంతో చేసేదేమీ లేక ఆమె స్థానంలో మరో నటి శ్వేత జోయెల్  ను తీసుకున్నట్లు తెలిపారు ఆరురాజా. బ్లూమింగ్ ఆర్ట్ స్టూడియో పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇది కుటుంబ కథా చిత్రమని వివరించారు దర్శకుడు ఆరు రాజా. ఓ ముఠా బారిన పడిన తన చెల్లిని.. హీరో ఆ ముఠా నుంచి కాపాడి ఎలా రక్షిస్తాడు అన్నదే చిత్ర ప్రధాన ఇతివృత్తం ఆరురాజా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: