కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ రాజీనామా త్వరలోనే ఆమోదం పొందనుంది. అలాగే ఆయన మరో రెండు మూడు రోజుల్లో వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.వైసీపీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే గన్నవరం నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా రానుంది. తిరిగివైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. వైసీపీ అభ్యర్థి అక్కడ పోటీ చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టిడిపి నుంచి ఎవరు ? పోటీ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట గన్నవరం నియోజకవర్గంలో 1989లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. గత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపి అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు.


గత రెండు ఎన్నికల్లో ఇక్క‌డ వంశీ గెలుస్తూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచినా గన్నవరం లో 900 ఓట్ల తేడాతో వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. వైసీపీ అభ్యర్థి యార్ల‌గడ్డ వెంకట్రావుపై విజయం సాధించారు. ఇక్కడ ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు దేవినేని అవినాష్ జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్సన్ గద్దె అనురాధ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమా రంగంలో ఉంటే గన్నవరంలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. ఒకవేళ ఉమా పోటీ చేసేందుకు అంగీకరించని పక్షంలో ఇది నియోజకవర్గానికి చెందిన గద్దె అనురాధను రంగంలోకి దింపు అని తెలుస్తోంది.


అనూరాధ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అన్న సంగతి తెలిసిందే. ఆమె గత ఐదేళ్ల పాటు కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. వాస్తవంగా చూస్తే గ‌ద్దె దంపతులకు గన్నవరం సొంత నియోజకవర్గం. ఇక్కడ నుంచి గద్దె రామ్మోహన్ 1994లో టిడిపి సీటు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ గ‌ద్దె దంపతులకు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది.


ఉమా పోటీ చేయ‌ని ప‌క్షంలో అవినాష్ క‌న్నా అనూరాధ అయితేనే ఇక్క‌డ పోటీ చేసేందుకు క‌రెక్ట్ అని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ దంప‌తుల‌కు క్లీన్ ఇమేజ్ ఉండ‌డం... ప్ర‌త్యేకించి కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో మంచి పేరు ఉండ‌డంతో అనూరాధను ఇక్క‌డ పోటీ చేయాల‌ని ఎక్కువ మంది కోరుతున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఈక్వేష‌న్లు ఎలా ?  మార‌తాయో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: