విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 3న భవన నిర్మాణ కార్మికులతో  భారీ ర్యాలీ నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. ఐతే టీడీపీ డైరెక్షన్ లో పవన్‌ పనిచేస్తున్నారని మండిపడుతోంది అధికార వైసీపీ. ఇది లాంగ్ మార్చ్ కాదని... రాంగ్ మార్చ్‌ అంటోంది. 


ఏపీలో congress PARTY YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక... ఇసుక కొరత తీవ్రంగా ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో ఏర్పడిన ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇసుక కొరత వల్ల సంక్షోభంలో పడ్డ భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు జనసేన అధినేత పవన్‌. తాజాగా... విశాఖ సాగరతీరం వేదికగా లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించింది జనసేన. నవంబర్ 3న ఈ భారీ నిరసన ర్యాలీ జరగనుంది. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నేతృత్వంలో జరిగే లాంగ్‌ మార్చ్‌లో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొనున్నారు. మద్దిలపాలెంలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర ప్రారంభించి... జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర ముగించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అనుమతులు తీసుకునే పనిలో ఉన్నారు జనసేన నాయకులు.  జగన్‌ ప్రభుత్వం నూతన ఇసుక విధానం ప్రకటించినప్పటికీ... ఆశించిన స్థాయిలో ఇసుక లభ్యం కావడం లేదు. ఫలితంగా మూడు నెలలుగా చాలా మంది కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో పండుగల పూట కూడా తాము పస్తులుంటున్నామని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాంగ్‌ మార్చ్‌కు జన సమీకరణ బాధ్యతల్ని నియోజకవర్గాల వారీగా పార్టీ  సమన్వయకర్తలకు అప్పగించింది అధిష్టానం. ఇందులో భాగంగా జన సైనికులు, వీరమహిళలు భవన నిర్మాణ కార్మికులను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఇసుక కొరతపై ఇప్పటికే టీడీపీ నిరసనలతో వేడి రాజుకుంది. ఇప్పుడు జనసేన లాంగ్ మార్చ్ కు రెడీ అవుతోంది. దీంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదురు దాడి ప్రారంభించింది. పవన్ కల్యాణ్‌ చేపట్టబోయేది లాంగ్ మార్చ్ కాదని... టీడీపీ గైడ్‌లైన్స్‌లో జరుగుతున్న రాంగ్ మార్చ్‌ అంటూ విమర్శిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక తొలి సారిగారి లాంగ్‌ మార్చ్‌ ద్వారా ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమౌతోంది జనసేన. దీని వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఎంత వరకూ ఊరట లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: