ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతోంది.  ముఖ్యంగా అనంతపురం రాజకీయాలు.  ఎప్పటి నుంచో అనంతపురం నుంచి బీజేపీ పాగా వేయాలని, బీజేపీ హావా అనంతపురం నుంచి మొదలు పెట్టాలని చూసింది.  ఇందులో భాగంగానే అనంతరపురంపై దృష్టి పెట్టింది.  ఇప్పటికే కొంతమంది నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  భవిష్యత్తులో మరికొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉన్నది.  


ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అక్కడి రాజకీయ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు.  జగన్ యువకుడు కావడమతొ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అనంతపురం సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.  


జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని దూకుడు అన్నది అయన పెరిగిన వాతారణంలో ఉందని, ఆ దూకుడు తగ్గించాలని, అనుభవజ్ఞులైన బొత్స,  పెద్దిరెడ్డి, బుగ్గన వంటి వ్యక్తులు జగన్ ను నడిపించాలని అన్నారు.  ఇక చంద్రబాబు విషయంలో కూడా జెసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు సేఫ్ గా ఉన్నారని, అయన లోపలికి వెళ్లారని అన్నారు.  జగన్ కుటుంబంతో పర్సనల్ గా తనకు ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయంగా కొంత విభేదం ఉన్న మాట వాస్తవం అన్నారు.  


ఇక జెసి బీజేపీపై కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పరిసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా జరగొచ్చని చెప్పారు.  చూస్తుంటే మోడీ పాకిస్తాన్ పై యుద్ధం చేసి పీవోకే ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేలా ఉన్నారని, అది జరిగితే.. తాను తప్పకుండా మోడీకి సపోర్ట్ చేస్తానని, మోడీకి ఓటు వేస్తానని అన్నాడు.  అది తొందరలోనే జరుగుతుందని, జరగాలని కోరుకుంటున్నట్టు జేసి దివాకర్ రెడ్డి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: