మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులను ఒకే పార్టీలో ఉండాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి షరతులు పెట్టడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉండాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పురందేశ్వరికి మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అన్న వార్తల నేపథ్యంలో ఆమె బిజెపిలో కొనసాగాలన్న నిర్ణయం తీసుకోవడంతో... తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉండక‌ తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు నేతలు సైతం దగ్గుబాటి దంపతులు ఒకే పార్టీలో ఉండాలని ఇప్పటికే స్పష్టం చేశారు.


ఇక ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా ఉన్న ద‌గ్గుబాటిని రేపో మాపో తప్పించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌ర్చూరులో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. అవసరమైనప్పుడు ఆహ్వానించి, అవసరం తీరిన తర్వాత అవమానిస్తారా అంటూ డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనుచరులు వైసీపీ అధిష్ఠానంపై మండిప‌డుతున్నారు. ద‌గ్గుబాటిని త‌ప్పిస్తే ఇక్క‌డ బాధ్య‌త‌లు ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.


గత ఎన్నికల్లో టీడీపీలో చేరి వైసీపీ ఓటమికి పనిచేసిన రామనాథంబాబును పార్టీలోకి తిరిగి తీసుకోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. వైసీపీ అధిష్టానం ఆలోచ‌న మాత్రం వేరుగా ఉంది. ఇక ద‌గ్గుబాటిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి రావి రామనాథం బాబు లేదా గొట్టిపాటి భ‌ర‌త్‌ల‌లో ఎవ‌రో ఒక‌రికి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తోంది. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి  బీజేపీలో కొన‌సాగేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఇక జ‌గ‌న్ ఆ ఫ్యామిలీని ఎంత మాత్రం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.


ఇక్క‌డ కొత్త వాళ్ల‌కు ప‌గ్గాలు ఇచ్చి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ సీటు కొట్టేలా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టి నుంచే ప్రారంభించేసిన‌ట్టు తెలుస్తోంది. ద‌గ్గుబాటిని దాదాపు త‌ప్పిస్తార‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన స్థానిక ప‌ర్చూరు నేత‌లు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కోసం ఇప్ప‌టి నుంచే ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది పార్టీలో పెద్ద గంర‌ద‌గోళానికి దారి తీయ‌డం ఖాయంగా ఉంది. మ‌రి అంతిమంగా ప‌ర్చూరు వైసీపీ ప‌గ్గాలు ఎవ‌రికి ఇస్తారో ?   చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: