హైదరాబాద్ బంగారమే. ఎందుకంటే అధి భాగ్యనగరం. రాజకీయ జీవులకు అయితే అది బంగారు బాతు గుడ్డు. అందుకే అంత యుధ్ధం జరిగింది. ఉమ్మడి ఏపీ ముక్కలు కావడానికి హైదరాబాద్  అతి ముఖ్యకారణం అని కూడా అంటారు. హైదరాబాద్ కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం  జరిగింది. దాన్ని వదులుకోవడానికి సీమాంధ్ర ప్రజలు సిధ్ధం కాకపోవడం వల్లనే దశాబ్దాల పోరు సాగింది.


మొత్తానికి కేసీయార్ హైదరాబాద్ తో కూడిన తెలంగాణాను సాధించారు. ఆయన అరేళ్ళ పాటు సీఎంగా కూడా ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇపుడు హైదరాబాద్ కి మళ్ళీ ముప్పు పొంచి ఉందిట. కేంద్రంలోకి బీజేపీ సర్కార్ కన్ను హైదరాబాద్ మీద పడిందని అంటున్నారు. కేంద్రంలో బలంగా ఉన్న మోడీ సర్కార్ కేసీయార్ని రాజకీయంగా బలహీనం చేయడానికి కొత్త ఎత్తులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు.


కేసీయార్ చేతిలో ఉన్న బంగారు బాతు గుడ్డు హైదరబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. అదే కనుక జరిగితే కేసీయార్ రాజకీయ అస్తిత్వం మొత్తం పోతుంది, ఆ విధంగా తెలంగాణాలో పట్టు పెంచుకోవచ్చునని కమలనాధులు సరికొత్త వ్యూహరచన చేస్తున్నారుట.  హైదరాబాద్ ఆదాయంతోనే మొత్తం తెలంగాణాను నడుపుతున్న కేసీయార్ ని అక్కడ నుంచి పట్టు సడలించి కదిపేస్తే రాజకీయంగా టీయారేస్ దెబ్బతినడం ఖాయమని బీజేపీ ఆలోచన చేస్తోందని  టాక్.


ఇక కేసీయార్ హుజూర్ నగర్ ఉప ఎన్నికతో  మరింత బలపడడం బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నారు. తెలంగాణాలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ కేంద్రంలో  తనకు ఉన్న అధికారాలు, అవకాశాలు అందిపుచ్చుకుని హైదరాబాద్ ని యూటీ చేసి ఏలాలనుకుంటోంది. అదే జరిగితే తెలంగాణాలో టీయారెస్ పని అయిపోయినట్లేనని అంటున్నారు. మరి హైదరాబాద్ తో కూడిన తెలంగాణాను తెచ్చిన కేసీయార్ దీనికి వూరుకుంటారా భారీ యుధ్ధమే చేస్తారా అన్నది కూడా చూడాలి. అయినా కాశ్మీర్ నే ముక్కలు చేశాక బీజేపీకి హైదరాబాద్ ఓ సమస్యా అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: