వంశీ రాజీనామా లేఖ తెలుగుదేశంపార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అందుకనే అందుబాటులో ఉండే సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబునాయుడు అత్యవసర సమావేశం పెట్టినట్లు సమాచారం. పార్టీలో ఇమడలేకపోతున్న గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ తన పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన వంశీ ఆ లేఖను చంద్రబాబుకు పంపటమే విచిత్రంగా ఉంది. పార్టీకి చేసిన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపటంలో అర్ధముంది. మరి ఎంఎల్ఏ రాజీనామా లేఖను స్పీకర్ కు కాకుండా పార్టీ అధ్యక్షునిగా పంపటంలో అర్ధమేంటి ? ఏమిటంటే పార్టీలో దేవినేని ఉమతో వంశీకి ఎప్పటి నుండో పడటం లేదన్న విషయం అందరికీ తెలుసు.

 

పార్టీలో వంశీ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. అందుకనే కనబడని శతృవుతో పోరాటం చేయలేకపోతున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ స్పష్టంగా చెప్పారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలే చివరకు కొంప ముంచుతాయనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది.

 

దేవినేనికి కంట్రోల్ చేయలేక వంశీని బుజ్జగించలేక వాళ్ళ గొడవలను చంద్రబాబు పట్టించుకోవటం మానేశారు. దాని ఫలితమే ఇపుడు ఎంఎల్ఏ రాజీనామా. ఎప్పుడైతే వంశీ రాజీనామా చేశారో వాళ్ళ గొడవ కాస్త ఇపుడు రోడ్డున పడింది. దాంతో చంద్రబాబు జోక్యం చేసుకోక తప్పటం లేదు.

 

తన మద్దతుదారులపై కేసులు నమోదవుతున్నాయంటే మరి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇళ్ళ పట్టాలను పంపిణి చేస్తే కేసులు నమోదు కాకుండా ఉంటాయా ? అందుకనే వంశీ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే విషయంలోనే చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సమావేశం ఏర్పాటు చేయటం  ద్వారా చంద్రబాబు ఏమి చేయదలచుకున్నారో ఆయనకే తెలియాలి.

 

రాజీనామాకు కారణాలుగా లేఖలో వంశీ చెప్పినవి కూడా అంత రీజనబుల్ గా లేవనే చెప్పాలి. తనకు అన్యాయం జరుగుతుంటే, మద్దతుదారులపై వేధిపులు మొదలైతే పోరాటం చేస్తారు కానీ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఎవరూ పారిపోరు. చూద్దాం అత్యవసర మీటింగ్ ఏం తేలుస్తుందో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: