ఇటీవల కాలంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నది.  కారణం ఏంటి అంటే.. అబ్బాయిల సంఖ్య ఎక్కువుగా ఉండటం.. దానికి తగిన విధంగా అమ్మాయిల సంఖ్య లేకపోవడమే అంటున్నాయి నివేదికలు.  అంతేకాదు, అబ్బాయిలు వివిధ వ్యసనాలకు బానిస కావడం.. ఆ బానిసత్వానికి బలికావడంతో.. అబ్బాయిలు అబ్బాయిలను ఇష్టపడటం లేదు.  దీంతో పెళ్లి కాకుండానే మిగిలిపోతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో ఎక్కువైంది.  


ఈ సంఖ్య రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఈ సంఖ్య అన్ని రాష్టాలకు పాకేవిధంగా మారిపోయింది.  అన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువ కావడంతో పాపం పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు.  ఒకందుకు ఇది మంచిదే అని చెప్పాలి.  ఇప్పటికే దేశజనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. జనాభాను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే.  


ఇకపోతే, గుజరాత్ లోని పియాజ్ గ్రామంలో గత నాలుగేళ్లుగా ఓ వింత ఆచారం అమలులో ఉన్నది. అక్కడ పెళ్లి చేసుకోవాలి అంటే కొన్ని షరతులు పెడతారు.  ఆ షరతుల ప్రకారం ఆ విషయాలను తప్పనిసరిగా పాటించాలి. పెళ్లి కుదుర్చుకోవడానికి వెళ్లిన సమయంలో, పెళ్లి నిశ్చితార్ధం సమయంలో, పెళ్లి జరగబోయే సమయంలో ఇలా మూడు సమయాల్లో అమ్మాయి తరపు బంధువులు 25 మంది వరుడిని వాసన చూస్తారు.  


అదేం ఆచారం అని తలలు పెట్టుకోకండి.  ఆచారమే కానీ వింత కాదు.  దీని వెనుక చాలా గొప్ప కథ ఉంది.  ఆ గ్రామంలోని యువకులు 13 సంవత్సరాల వయసులోనే మద్యానికి అలవాటు పడుతున్నారు. చేతికొచ్చే సమయానికి కాలం చేస్తున్నారు.  దీంతో పెళ్ళైతే మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోవాల్సి వస్తోంది. అందుకే ఆ గ్రామం ఈ కట్టుబాటును తీసుకొచ్చింది.  ఇందులో భాగంగానే పెళ్ళికి ముందు అబ్బాయిని ఇలా వాసన చూస్తారట.  మంచి ఆచారమే కదా మరి అది.  అన్ని చోట్ల ఇలానే జరిగితే బాగుంటుంది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: