తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ప‌న్నిన ఉచ్చుల్లో ఆర్టీసీ కార్మికులు చిక్కుకున్నారా..?  కేసీఆర్ వేసిన ఎత్తుకు ఆర్టీసీ కార్మికులు చిత్తు కాబోతున్నారా..?  తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో వేసిన ఉద్య‌మ ఎత్తుగ‌డ‌ల‌ను ఆర్టీసీ స‌మ్మెపై అమ‌లు చేస్తున్నారా..?  తాను చేయాల‌నుకున్న ప‌నిని స‌మ్మె ముసుగులో చేసుకునేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌లు ఫ‌లించ‌బోతున్నాయా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇంత‌కు కేసీఆర్ తీసుకుంటున్న ఎత్తుగ‌డ‌లు, చేయ‌బోయే ప‌ని ఏంటో తెలిస్తే షాక్ త‌గ‌లాల్సిందే..


కేసీఆర్ నిజాం కాలం నాటీ ఆస్తుల‌పై క‌న్నేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అందులో భాగంగా టీఎస్ ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో వేల కోట్ల విలువ చేసే భూములు, ఆస్తులు ఉన్నాయి. వీటిని త‌న అనుచ‌రుల‌కు ప్రైవేటీక‌ర‌ణ చేస్తే క‌ట్ట‌బెట్టేందుకు అవ‌కాశం ఉంద‌ని టాక్‌. అందుకే ఆర్టీసీని ప్రైవేటు సంస్థ‌కు అప్ప‌గిస్తే ఆర్టీసీ ఆస్తుల‌న్ని వారికి చెందుతాయి. ఆర్టీసీ ఆస్తుల‌ను అప్ప‌నంగా వాడుకుంటూ, భూముల‌ల్లో మ‌ల్టీప‌ర్ప‌స్ బిజినెస్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలా ఆర్టీసీని ప్రైవేటీక‌ర‌ణ చేస్తే ఎంతో లాభం రాబోతుందని కేసీఆర్ ఆలోచ‌న‌.


అందుకే ఆర్టీసీని ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్న క్ర‌మంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలు ప‌సిగ‌ట్టాయి. అందుకు త‌గిన విధంగా మెగా క్రిష్టారెడ్డి ఇంట్లో సీబీఐ చేసిన సోదాల్లో దొరికిన ప‌త్రాల్లో ఆర్టీసీ ప్రైవేటీక‌ర‌ణ కు సంబంధించిన కీల‌క‌మైన ఆధారాలు దొరికాయి. ఇక ఆర్టీసీని ఎలాగైనా కాపాడుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఆర్టీసిని ప్ర‌భుత్వ ప‌రం చేయాల‌నే డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక తాను అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరాలంటే ఆర్టీసీ స‌మ్మెను ఎలాగైనా నిర్విర్యం చేయాల‌ని కేసీఆర్ పావులు క‌దుపుతున్న‌ట్టు భోగ‌ట్టా. అందుకే కేసీఆర్ కోర్టు తీర్పుల‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని కార్మికులకు ఉచ్చులు బిగిస్తున్నారంటున్నారు.


కేసీఆర్ ప‌న్నిన వ‌లే చ‌ర్చ‌ల‌కు పండుగ పూట ఎంచుకోవ‌డం, ఆదివారం కావ‌డం, చ‌ర్చ‌ల్లో కార్మికుల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డే డిమాండ్ల‌ను కాకుండా సాధార‌ణ డిమాండ్ల‌ను చ‌ర్చ‌కు పెట్ట‌డం, కార్మిక సంఘాలు స‌మయానికి రాలేద‌ని డొంక‌తిరుగుడు వాద‌న‌లు చేయ‌డం, అస‌లు చ‌ర్చ‌లు కార్మిక సంఘాల‌కు ఇష్టం లేద‌ని అందుకే వారే వాకౌట్ చేశార‌ని అభాండం వేయ‌డం, వీటిని పెద్ద‌విగా చేసి హైకోర్టులో దృష్టికి తీసుకెళ్ళి కార్మికులంద‌రిని ఓకే వేటుతో తొల‌గించే ప‌నికి నాంది ప‌లికేందుకు వేసిన ఎత్తుగ‌డ‌లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


హైకోర్టు ఇటు ఆర్టీసి కార్మికుల స‌మ‌స్య‌లు తీర్చాల‌ని, అందుకు వారితో చ‌ర్చ‌లు జ‌రుపాల‌ని ఆదేశించింది. అందుకు త‌గిన విధంగా మేము చ‌ర్చ‌లు జ‌రిపాము.. కార్మిక సంఘాలే మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి అనేందుకు నిన్న‌టి చ‌ర్చ‌లే తార్కాణం అని చెప్పేందుకు అవ‌కాశం స‌ర్కారుకు కార్మిక సంఘాలు ఇచ్చారు. ఈరోజు హైకోర్టు తీసుకోబోయే చ‌ర్య‌ల‌పైనే ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: