దళారుల చేతుల్లో దగా పడుతున్న, ఓ చీనీ రైతు ఆవేదనని లేఖ రూపంలో ఆంధ్రప్రదేశ్  సీఎం జగన్ మోహన్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఆ రైత్ లేఖ సారాంశమిది.మాది కడప జిల్లా ,పులివెందుల నియోజకర్గం , సింహాద్రిపురం మండలం, బిదినంచెర్ల గ్రామం సార్, మాకు గతం లో ఉన్న ప్రభుత్వం తో మాకు  పనిలేదు సార్, మీ మీద నమ్మకంత, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మార్చే బాగంగానే మా రైతు దీన స్థితిని కూడా మారుస్తారని నమ్మకంతో  మీకు మా చీనీ రైతులందరు చెబుతూ  వేడుకుంటున్నది ఏమిటంటే, ఇన్ని రోజులుగా చీనీ రైతు  వేరుపురుగు తెగుల్లతో ,బోర్లు ఎండిపోయి ,ఒక టిప్పు 500 రూపాయలు పెట్టీ నీళ్ళని ట్రాక్టర్లతో తోలించుకుని మరీ చెట్లను కాపాడుకుంటూ వచ్చాం సార్, ఈ విధంగా చాలా ఇబ్బంది పడ్డాడు చీనీ రైతు గత మూడు సంవత్సరాల క్రితం వరకు.  ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అందరూ మంచిగానే ఉంటూ రైతులందరూ తమపనులు తాము చేసుకుంటూ చీనీ పంట మంచిగ పండిచ్చుకుంటున్నారు సార్,కానీ మద్యలో ఈ దలారి వ్యవస్థ వలన చీనీ రైతు జీవితాలు నలిగిపోతున్నాయి సార్.


ఒక రైతు 10 టన్నులు చీనీ కాయలు పండిస్తే, అందులో  2 రెండు టన్నులు సూట్ అంటూ ఎటువంటి పంట పండించని  దలారి వెదవ సులువుగ 2 రెండు టన్నులు కాయలు అప్పటికప్పుడు కష్టపడే రైతు దగ్గరే 10 నిమిషాలలో సంపాదిస్తున్నాడు, ఎలాగంటే పని కూల్లు,లారీ బాడుగలు మార్కెట్లో రేట్ లేదు అంటూ ఇలా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఈ దళారులు ,ఇప్పుడు  ఒక టన్ను  64 వేల రూపాయలు అంటే 2 రెండు టన్నులు కాయలు ప్రస్తుత ధరల్లో అయితే 2 రెండు టన్నుల చీనీ విలువ 1,28000 వేల రూపాయలు సీఎం సార్, అయితే బాగా గమనించండి సార్ మన పులివెందుల నుంచి బెంగుళూర్ మార్కెట్ కి కనీసం అంటే 280 కిలోమీటర్లు సార్ దీనికి కాయలను లారీలో తరలిస్తే ఎంత కర్చు అవుతుంది అనేది మీరే చెప్పండి సార్. 15 వేలు బాడుగ అంతే సార్.



అలాగే కాయలు కోసే కూలీలకు ఒక 15 వెలు అనుకోండి సార్ ఇప్పుడు మొత్తం కలిపితే 30 వేలు సార్ దానికి ఇంకో 5 వేలు అదనంగా ఇద్దాం సార్ పోతే పోని అప్పుడు 35 వెలు అవుతుంది సార్ ప్రస్తుత దరల ప్రకారం అయితే 2 రెండు టన్నులు కాయల విలువ 1,28000 వేలు సార్ దీనిలో 35 వేలు తీసేస్తే మిగిలింది ఒక తొంబై మూడు 93 వేలు సార్,ఈ విధంగా చదువుకొని పెద్ద అయి ఇంజనీర్ ఉద్యోగం చేసే వాడు కూడా నెలకి 20 నుంచి 30 వేలు తీసుకుంటున్నారు సార్, కానీ ఈ దళారీ వెదవ ఒక తోట దగ్గరే 10 టన్నులు అయిన రైతు తోట దగ్గరే మన కళ్ళముందే, లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు సార్ , ఒక రైతు దగ్గరే ఇంత సులువుగా దళారీ సంపాదిస్తూ ఉన్నాడే మరి సంవత్సరం పొడుగునా ఆ వెదవ దలారి గాడు ఇదే వ్యాపారం చేస్తాడు సార్, అలాంటప్పుడు సంవత్సరానికి  ఎన్ని లక్షల రూపాయలు వెనుకేస్తున్నాడో  ఆలోచించండి? దయచేసి అలాగే పంట పండించిన రైతు ఎంత సంపాదిస్తాడు మీరే ఆలోచించండి సార్.



అంటే ఇక్కడ రైతు ఎం పాపం చేస్తున్నాడు సార్?ఇంత గతి పడుతుంది,పొలంలో  కష్ట పడుతున్నాడు చూడు సార్ అక్కడ చినిగిపోయిన బట్టలతో ఉంటాడు వీడికి ఎం తెలియదు లెండి అంటారా సార్ రైతు కూడా వాళ్ళ కొడుకులని , కూతుర్లను చదివిస్తున్నాడు వాళ్ళ పిల్లలు ఎం తిక్కొల్లు కాదు సార్,వాళ్ళ నాన్నగారు కష్ట పడే కష్టానికి విలువ చెప్పాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది సార్, రైతు లేకుంటే ఈ సమాజమే లేదు సార్ , ప్రతి రైతు వూరికే కాదు సార్ వాళ్ల పిల్లోల్లని చడివించేది ఇలాంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికే సార్, దయచేసి మీరు ఈ మోసాన్ని గ్రహించి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి దలారి వ్యవస్థ లేకుండా చేయండి సార్ అప్పుడు రైతు బాగుపడుతాడు అప్పుడు ఆ రైతుకి విలువ ఉంటుంది సార్ ,



ఈ రైతు పంట పండించే సమయం లో ఏదన్నా ఇబ్బంది వచ్చిన రైతు పెళ్ళాల మెడలో ఉన్న పుస్తులు కూడా అమ్ముతాడు సార్, అదే ఒక ఉద్యోగి కానీ ఒక దళారీల పెళ్ళాలు కానీ ఇలాగ వాళ్ళ భార్యల మెడల్లో ఉన్న పస్తులు ఎక్కడన్నా అమ్మడం చూసారా సార్? చూసిండరు సార్, ఏదన్నా ఇక్కడ తప్పుగా మాట్లాడింటే క్షమించండి సార్ ,మేము ఏమి అడగలేదు సార్ మన పులివెందుల సరిహద్దు ప్రాంతంలోనే మన ప్రాంత రైతులకు ఒక ఎక్సపోర్ట్ మార్కెట్ పెట్టండి సార్ మీ పాదాలకు ముక్కుతాము సార్.  రైతు విలువ మీకు బాగా తెలుసు సార్ ఎందుకంటే మీకు ఉన్నాయి చీనీ చెట్లు సీఎం సార్ .  మీరు ఒకప్పుడు వ్యవసాయం చేసిన వాళ్లే కదా సార్ . దయచేసి ఆంధ్రప్రదేశ్ లో దలారి వ్యవస్థను తొలగించి మీరే రైతుకు ఒక చీనీ మార్కెట్ ని నిర్మించాలని ప్రాధేయపదుతున్నాను  సార్ అంటూ కడప జిల్లా పులివెందుల తాలూకా, సింహాద్రిపురం మండలంకు చెందిన  చీనీ రైతు కొడుకు వై.శ్రావణ్ కుమార్ రెడ్డి (9182758385 ) లేఖ రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: