టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వంశీ వైసిపీలోకి వెళ్ళకుండానే గన్నవరం వైసీపీలో ముసలం మొదలైంది. వంశీ సీఎం జగన్ ని కలుసుకోవటం.. ఆయన వైసీపీలో చేరతారన్న‌ వార్తల నేపథ్యంలో గన్నవరం వైసీపీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం యార్ల‌గడ్డ జగన్ ను కలవనున్నారు. వంశీ వైసీపీలో చేరనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


గత ఎన్నికల్లో వెంకట్రావు వంశీకి తీవ్ర పోటీ ఇచ్చారు. కేవలం 900 ఓట్ల తేడాతోనే వంశీ గెలుపొందారు. వెంకట్రావు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు వంశీ చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే వంశీని వైసీపీలో చేర్చుకునే విషయంలో గన్నవరం వైసీపీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది . ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారని ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎలా చేసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల‌కు చెందిన వైసీపీ పార్టీ అధ్య‌క్షులు, కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఇప్పుడు వంశీ రాక‌ను వ్య‌తిరేకిస్తూ తీవ్ర‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే గత మూడు సంవత్సరాలుగా గన్నవరంలో వైసీపీని పటిష్టం చేసిన యార్లగడ్డ వెంకట్రావు భవిష్యత్తు ఏంటి అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇక టిడిపికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వంశీ, దీపావళి తర్వాత తాను పార్టీ మార్పుపై స్పందిస్తానని స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను చంద్రబాబు ప్రకటించిన తాను... రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నానని చెప్పటం మరో షాకింగ్ గా మారింది.దీంతో అసలు వంశీ రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకుంటారు.? వంశి అందరినీ ఎందుకు కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: