ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జలవనరుల శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. సమీక్షలో పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం సమీక్షించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు రివర్స్ టెండరింగ్ వంటి అంశాలపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు.

 


రాష్ట్రంలోని ప్రాజెక్టులు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులపై సమీక్షలో చర్చకు రావొచ్చని తెలుస్తోంది. ఇటివల ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై ఎస్టిమేట్ కమిటీతో జరిగిన భేటీలోని అంశాలను సీఎంకు ఉన్నతాధికారులు వివరించనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు 750 కోట్ల రూపాయలు ఆదా అయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన ప్రాజెక్టుల వివరాలను కూడా సీఎంకు వివరించనున్నారు. వీటిని త్వరగా పూర్తి చేయగలిగితే ఆయా ఆయకట్లకు నీరు అందించే అవకాశం ఉందని వివరించనున్నారు. కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన మూడు కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి 3వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించనున్నారు. పునరావాస పనుల గురించి కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 


గాలేరు-నగరి, ఉత్తరాంధ్రలోని సుజల స్రవంతి, తోటపల్లి ప్రాజెక్టుల పనులపై కూడా సీఎం చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఉన్నతాధికారులు సీఎంకు వివరించనున్నారు. రాష్ట్రంలో జలకళ సంతరించుకున్న సందర్భంగా ప్రాజెక్టుల్లో నీటి వివరాలు కూడా సీఎంకు తెలియజేయనున్నారు. సమీక్ష అనంతరం పూర్తి వివరాలు మరింత తెలియవచ్చే అవకాశం ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: