ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్చల్లో పురోగతి లేదు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా కార్మికులతో ప్రభుత్వం మొక్కుబడిగా చర్చలు జరిపింది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చర్చలు జరపలేదని అర్థమౌతుంది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కేవలం 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. కార్మికులు 26 డిమాండ్లపై గత 21 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది. దీన్నిబట్టే చర్చల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్ ను కాదని మిగతా డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం పూనుకున్నది. చర్చల సందర్భంగా కార్మిక నాయకులు సెల్ ఫోన్ లను లాక్కొని, కేవలం నలుగురు నాయకులను అనుమతించారు. నిర్భందంలో చర్చలు జరిపారని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి మీడియాతో వెల్లడించారు. తమ డిమాండ్లపై యాజమాన్యం పట్టించుకోవడం లేదని, సమ్మె కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. కానీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. కార్మికులే చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని, బయటకు వెళ్లి వస్తామని చెప్పి రాలేదని ఆర్టీసీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు. ప్రభుత్వం, కార్మికులు విభిన్న ప్రకటనలు చేశారు. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు. పైగా ప్రభుత్వానికి కూడా సమస్యలను పరిష్కరించాలని లేదని తెలుస్తుంది.


ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈనెల 24 వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో ఆర్టీసీ కార్మికులపై బాద్యతరహితంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో చర్చలు జరిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని అప్పుడే అర్థమైంది. కానీ చర్చలకు ప్రభుత్వం పిలిచినప్పుడు కార్మిక సంఘాలు వెళ్లకపోతే సరైంది కాదని చర్చలను స్వాగతించారు. కానీ చర్చలు జరపకుండానే మధ్యలోనే సంఘాల నాయకులను బయటకు నెట్టివేసిందని తెలుస్తుంది. దీన్నిబట్టి ఆర్టీసీపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బయటపడింది. శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్ లోని ఎర్రమంజిల్‌ కాలనీలోని ఆర్టీసీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం జరిగిన చర్చలు జరిగిన విషయం తెలిసిందే.


మరో రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలపై రాష్గ్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ నాగిరెడ్డి కూడా కసరత్తు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దీన్నిబట్టి అధికార యంత్రాంగం కూడా ఎన్నికలకు సన్నద్ధమౌతున్నట్లు అర్థమౌతుంది. దీంతో ప్రతిపక్షాలు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్లకతప్పదు.
రాష్ట్రంలో గత ఏడాది కాలం నుంచి అధికార పార్టీ టీఆర్ ఎస్ కు ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీదే పై చెయ్యి. ఎంపీ ఎన్నికల్లో కొంత తడబడినప్పటికీ, దాని తర్వాత జరిగిన జెడ్పీటీసీ , ఎంపీటీీసీ ఎన్నికల్లో టీిఆర్ఎస్ విజయఢంకా మోగించింది. దీంతో ఆ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.


టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాల్లేవు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి కూడా అంతగా అనుకూలంగా లేవని తెలుస్తుంది. గ్రామీణ ఓటర్లతో పోల్చితే పట్టణ ఓటర్ల తీర్పు వేరుగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన ఏడాది దాటినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ నోటిఫికేషన్లు వేయలేదు. పైగా టీఆర్టీ పరీక్షల ఫలితాలు వచ్చి ఆరు నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకూ పోస్టింగులు ఇవ్వలేదు. పైగా ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు 61సంవత్సరాలకు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించింది. కానీ ఇప్పటి వరకూ వీటిని అమలు చేసేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాకుండా ప్రస్తుతం 21 రోజుల నుంచి నడుస్తున్న ఆర్టీసీ సమ్మె ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పడే అవకాశాలున్నాయి. పైగా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉంటారు కొంత ఆలోచించి ఓటు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయలేదు. చాలా మంది బస్తీల్లోని పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా నూతన పింఛన్లను కూడా ప్రభుత్వం ఇప్పటి వరకూ విధి, విధానాలను కూడా అంతా ఈజీ కాదని తెలుస్తుంది. అధికార పార్టీ హామీలను నేరవేర్చడంలో డీలా పడడంతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఊరట కల్గించే అంశాలు. అయితే బీజేపీకి పట్టణ ప్రాంతాల్లోనే ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. దీంతో మున్సిపల్ లో తమ సత్తా చాటాలని ఆ పార్టీ చూస్తుంది. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ లో ఓటర్లు ఏ పార్టీని వరిస్తారో వేచిచూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: