ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య పట్టిపీడిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని టిడిపి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక అధికార వైసీపీ ని టార్గెట్ చేయడం లో టీడీపీ తో పోటీ పడుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు గుప్పించిన కన్నా లక్ష్మీనారాయణ... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత  సమస్య పై స్పందించిన లక్ష్మీనారాయణ... పలు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య సృష్టిస్తున్న  భీభత్సం అంతా ఇంతా కాదని... భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పని లేక ఇబ్బందులు పడుతున్నారన్న కన్నా... ఈ  క్రమంలోనే సీఎం జగన్ ప్రభుత్వం పై సంచలన విమర్శలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు తమ పార్టీ రంగులు వేయడానికి ఉన్న తొందర... ప్రజలకు మంచి పాలన అందించడంలో అధికార వైసిపి పార్టీకి లేదని ఆయన విమర్శించారు. 

 

 

 

 వైసిపి పార్టీ ఆర్భాటాలు చేసే పార్టీ తప్ప దేనికి పనికి రాదు అని ధ్వజమెత్తారు. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎంగా జగన్ పలు భవనాలకు కార్యాలయాలకు నీటి ట్యాంకులను ఇంకా పలు ప్రదేశాల్లో వైసీపీ రంగులు వేయడం గురుంచి  ప్రస్తావించిన కన్నా లక్ష్మీనారాయణ... ప్రభుత్వానికి రంగులు వేయడం లో ఉన్న శ్రద్ధ ఇసుక కొరత తీర్చడానికి లేదు  అన్నారు. ప్రజలు తమకు మెరుగైన పాలన లభిస్తుందని 150 సీట్లు ఇచ్చినందుకు ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా 150 రూపాయలు కూడా రాని పరిస్థితి భవన నిర్మాణ రంగ  కార్మికులకు  తీసుకువచ్చిన ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకు చూడలేదని విమర్శలు గుప్పించారు ఆయన. ఇసుక కొరత  సమస్యను  సృష్టించి ప్రజలకు పనులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: