తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు మార్చడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల మార్పు విషయంలోనే చర్చ నడుస్తోంది. నాలుగు నెలల వ్యవధిలోనే ఇన్చార్జ్ మంత్రులు మార్చడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇన్చార్జి మంత్రుల మీద వచ్చిన ఆరోపణల కారణంగా నే జిల్లా  ఇన్చార్జి మంత్రులను  మార్చారా లేక మరేదైనా కారణం ఉందా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మినహా మిగతా అందరిని మార్పు చేయడం వెనుక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏదైనా వ్యూహంతో ఉన్నారా అని అనుకుంటున్నారు. 

 

 

 

 రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ  సత్తా చూపేందుకు జగన్ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అందుకే జిల్లా ఇన్చార్జి మంత్రుల మార్పులు చేశారని కొందరు భావిస్తున్నారు. కాక ఒక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మినహా మిగతా మంత్రులందరినీ మార్పు చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఏదో పక్కా వ్యూహం ఉండడం వల్లనే జగన్ జిల్లా ఇన్చార్జి మంత్రులను మార్పు చేశారని అనుకుంటున్నారు. 

 

 

 

 అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో... రాజకీయవర్గాలు షాక్కి గురయ్యాయి . నాలుగు నెలల వ్యవధిలోనే జిల్లా ఇన్చార్జి మంత్రులను మార్పు చేయడం ఏంటని అందరూ భావిస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రుల మార్పు చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా... వైసీపీ పార్టీ తమ సత్తా చాటేందుకు... పక్కా ప్రణాళికలు వ్యూహాలతో ముందుకు వెళుతున్నట్లు  అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... జిల్లా ఇన్చార్జి మంత్రుల మార్పు అనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: