లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సాధించిన ఘనవిజయం చూశాక, మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, హరియాణాలో 11 నెలల క్రితమే దుష్యంత్ చౌటాలా ఏర్పాటు చేసిన జన్‌నాయక్ జనతా పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి.ఈ రెండు రాష్ట్రాల్లో ఈ తరహా ఫలితాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు.నరేంద్ర మోదీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలు కళ్లెం వేయగలవా అన్న ప్రశ్నను ఏ ఫలితాలు  తెరమీదకు తెచ్చాయి.ఆ అభిప్రాయానికి రావడం తొందరపాటు చర్య అవుతుంది.


కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు లేవు. 2018 డిసెంబర్‌లో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీనే మంచి ప్రదర్శన చేసింది.కాంగ్రెస్ బలహీనపడ్డ, లేక ఆ పార్టీ ఉనికి దాదాపు లేని చోట్ల బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో శూన్యత ఎక్కువ కాలం కొనసాగదు.ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఆయా రాష్రాల ఎన్నికల వరకే పరిమితం. మోదీ జాతీయ స్థాయి నేత. ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో రాజీకి రావాల్సి వచ్చుండొచ్చు. కానీ కేంద్ర రాజకీయాల్లో వాటి ప్రభావం పెద్దగా ఉండదు.


ఇపుడు  అందరి చూపు బిహార్‌పైనే ఉంది నెక్స్ట్ ఎలెక్షన్స్ బీహార్ లో ఉన్నాయి . అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో నీతీశ్ కుమార్ పార్టీ జేడీయూ కూడా ప్రముఖమైంది.గతంలో ఇందిరా గాంధీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఒక్కటయ్యాయి. ఇప్పుడు వాటిని తమతో కలిసివచ్చేలా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ, చాలా చోట్ల ఆ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి.


లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగిస్తుందని భావించినా, అది జరగలేదు.హరియాణా, మహారాష్ట్రల్లో ఆర్థిక మందగమనం ప్రభావం పడింది. మహారాష్ట్రలో పార్లే సంస్థ వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వినియోగంపై విధించిన ఆంక్షలతో వాటి ఉత్పత్తి ద్వారా ఉపాధి పొందుతున్నవారు, అసంఘటిత రంగంలోని రిటైలర్లు ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు


మరింత సమాచారం తెలుసుకోండి: