గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరడం ఆంధ్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. టీడీపీ  ఎమ్మెల్యేగా,  ముఖ్య నేతగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ... టీడీపీ  పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం ఆంధ్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అయితే గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీ ఫిరాయింపుల కు ప్రోత్సహించిన విషయం తెలిసిందే. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాటికి చోటు లేదని.. ఒకవేళ తమ పార్టీలో చేరాలనుకుంటే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే చేరడానికి వీలు ఉంటుందని జగన్ తెలిపారు. 

 

 

 

 

 ఈ నేపథ్యంలోనే గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ నేత రఘురామ్  మరో బాంబు పేల్చారు. వల్లభనేని వంశీ తో పాటు టిడిపి మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బిజెపి వైసీపీని సంప్రదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే  బిజెపి వైసిపి తోనే చర్చించి వల్లభనేని వంశీ టిడిపికి గుడ్బై చెప్పారు అని ఆయన తెలిపారు. కాగా  వైసిపి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపిన బిజెపి నేత రఘురాం... మచ్చలేని నేతలు తమ పార్టీలోకి రావొచ్చునని బిజెపి నేతలకు అండగా ఉంటుందని ప్రకటించారు. 

 

 

 

 

 అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు బిజెపిదేనని రఘురాం వ్యాఖ్యానించారు. పార్టీలు మారే వారిపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని... అలాంటి వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. అయితే ప్రస్తుతం రఘురామ్  వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేత అయిన వల్లభనేని వంశీ సైకిల్  దిగి ఫ్యాన్ గూటికి చేరడంతో టిడిపి అధినేత చంద్రబాబుlo ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. మిగత ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చంద్రబాబు చర్చలు కూడా జరుపుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: