ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై ఇప్పటికే 24 రోజులయింది. ఆర్టీసీ కార్మికులు పట్టు వీడకపోవటం, ఆర్టీసీ కార్మికులు కోరిన డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం చర్చ జరపకపోవటంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు, అద్దె బస్సుల నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ జరగబోతుంది. హైకోర్టు గతంలో ఆదేశాలు ఇవ్వటంతో ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపింది. 
 
కానీ ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చల మధ్యలో వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. జేఏసీ నాయకులు మాత్రం కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు ఆహ్వానించారని చర్చల సమయంలో సెల్ ఫోన్లు తీసుకున్నారని భయభ్రాంతులకు గురి చేశారని  చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వాదనను ఎదుర్కోవటానికి ఆర్టీసీ కార్మికులు కూడా తమ న్యాయవాది తరపున సిద్ధంగా ఉన్నారు. 
 
జేఏసీ నాయకులను చర్చల నుండి బలవంతంగా ఆర్టీసీ యాజమాన్యం పంపించిందని యూనియన్లు కోర్టుకు చెప్పనున్నాయని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లాలన్నా, ఊళ్ల నుండి తిరిగి రావాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. 
 
కేసీఆర్ నిన్న జరిపిన సమీక్షలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పెంచాలని చెప్పటంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీన సకల జనుల సమ్మె పేరుతో ఆర్టీసీ కార్మికులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. హైకోర్టు తీర్పు ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తాత్కాలిక డ్రైవర్ల వలన ప్రజలు కష్టాలు పడుతున్నారని కూడా ఆర్టీసీ కార్మికులు వాదన వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల గురించి కూడా హైకోర్టులో  కార్మికులు వాదన వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: