సాధారణంగా దెయ్యాల నగరాలు అంటే అందరూ వెంటనే భయభ్రాంతులకు గురి అవుతారు. ఇది ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించినట్టు వంటి దెయ్యాల నగరాలు కాదు లెండి. ప్రకృతి వైపరిత్యాలు వచ్చి అందరు ఊర్లను వదిలేసి వెల్లిపోయినా కూడా, ఇటువంటి ప్రదేశాలను ఎడారులుగా భావించి రకరకాల కథనాలు అల్లుతారు. మెల్లగా, ఇవే పూకార్ల వలన భూత ప్రేత నగరాలుగా ప్రసిద్ధి చెందుతాయి. కానీ, లోతుగా ఆలోచిస్తే, ఇవి ఎన్నో కుటుంబాలకు ఒక నాడు జీవనోపాధిని కల్పించాయి అని, ఎంతో చరిత్రను ఒక నాడు లిఖించిన నగరాలు అన్న విషయాన్ని మనము మర్చిపోతాము.



మరి ఈ నగరాలను మళ్ళి పూర్వ వైభవానికి తీసుకు రావాలి అంటే మనం ఏమి చెయ్యాలి? అండమాన్ ఎండ్ నికోబార్ దీవులలో రాస్ ఐల్యాండ్, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపుర్ సిక్రీ, తమిళ నాడు లోని ధనుష్‌కోడి, మధ్య ప్రదేశ్ లోని మాండు, ఓల్డ్ గోవా, కర్ణాటక లని విజయనగర్, ఇవాన్ని కూడా మన భారతదేశం లోని భూత నగరాలుగా ఎంతో ప్రసిద్ది గాంచాయి. ఇవి ఎంతో గొప్ప నగరాలుగా విరసిల్లాల్సిన సమయం లో ఇలా ఎందుకు పనికి రాని స్థలాలుగా మిగిలిపోవటం బాధాకరం.


తాజాగా అమరావతిలో కూడా ఏమి చెయ్యాలో దిక్కు తోచక జనం అయోమయంలో ఉండటం, వ్యాపారవేత్తలు ముందుకు వెళ్ళకపోవడం వంటి కారణాల చేత ఇక నుండి అమరావతిని కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు అని తాజాగా కథనాలు వస్తున్నాయి.



ఇందుకోసమే ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ అన్ని నగరాలలో అభివృద్ధి పెంచాలి అని, తద్వారా మళ్ళీ పూర్వ వైభవానికి వస్తాయి అని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా ఈ వ్యూహాన్ని చైనా లో అమలు చేసి విజయవంతంగా ఎంతో ఆర్థిక అభివృద్ధి చుసాయి అట. అందుకే భారతదేశం కూడా అటుగా ఆలోచన చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: