తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పై  పై హైకోర్టులో వాదనలు జరిగాయి . అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆడిటర్ జనరల్ అడ్వకేట్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తో పాటు అన్ని అ అంశాలపైనా ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబట్టారని... కోర్టు చెప్పిన ప్రకారం 21 డిమాండ్లను  మాత్రమే పరిష్కరిస్తాం అన్న  వినలేదని చర్చల నుండి అర్దఅంతరంగా  వెళ్లిపోయారని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆర్టీసీ జేఏసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు విలీనం డిమాండ్ను పక్కనబెట్టి మిగతా అంశాలపై చర్చించాలని  యూనియన్లకు సూచించింది. ఒక్క డిమాండ్ పైనే పట్టుబట్టకుండా మిగితా  డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరపాలని ఆదేశించింది. రాత్రికి రాత్రి విలీనం కావాలంటే ఎలా జరుగుతుంది ఆర్టీసీ యూనియన్లు ప్రశ్నించింది  హైకోర్టు. 

 

 

 

 ఆర్టీసీ యూనియన్లు  ప్రభుత్వంతో  చర్చ జరపకపోతే ఇదే ప్రతిష్టంభన  కొనసాగుతుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు విఫలం అవుతున్న  నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ... మరోసారి గుర్తు చేసింది హైకోర్టు. నిన్న జరిగిన చర్చల గురుంచి  వివరాలతో ఆర్టీసీ యాజమాన్యం  కోర్టుకు అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. చర్చల సమయంలో అన్ని డిమాండ్ పై చర్చించి పరిష్కరించమని  ఆర్టీసీ యూనియన్లు పట్టుబట్టినట్లు నివేదికలో పేర్కొంది. అయితే  మొత్తం 45 డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే కేవలం 21 మంది మాత్రమే పరిష్కరిస్తాం  అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని  ఆర్టీసీ యూనియన్ల తరుపు న్యాయవ్యది  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

 

 

 

 గత  శనివారం ప్రభుత్వం నియమించిన కమిటీ కి యూనియన్లకు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మె ముగుంపు  ఏంటని  అందరూ భావిస్తున్నారు. కాగా ఇరు వర్గాల  వాదనలు విన్న హైకోర్టు నేడు ఏం నిర్ణయం తీసుకుంటుందని దానిపై రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది. కాగా  ప్రతిరోజు వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్న కార్మిక యూనియన్లు  ఈ నెల 30న సకల జనుల సమ్మె నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు హై కోర్టు తీర్పు కీలకంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: