ఇస్మామిక్ స్టేట్ చీఫ్ అల్ బాగ్దాదీని శనివారం రోజు సిరియాలో సైనికులు చుట్టుముట్టారు. సైనికుల హెచ్చరికలతో బాగ్దాదీ ఆత్మాహుతి కోటును పేల్చుకోవటం ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు. బాగ్దాదీతో పాటు అతడి ముగ్గురు పిల్లలు కూడా ఆత్మాహుతి పేలుడులో చనిపోయారు. ఆత్మాహుతి పేలుడులో బాగ్దాదీ శరీరం ముక్కలైపోయింది. కానీ బాగ్దాదీ మరణంతో కైరా ముల్లెర్ కు మాత్రం న్యాయం జరిగింది. 
 
26 సంవత్సరాల కైరా ముల్లెర్ అమెరికాలోని అరిజోనాలో నివశించేది. కైలా ముల్లెర్ ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించటం కొరకు వెళ్లే సమయంలో ఐసిస్ కైరా ముల్లెర్ ను కిడ్నాప్ చేసింది. ఐసిస్ అధినేత అబు బాగ్దాదీ కైరా ముల్లెర్ ను అత్యాచారం చేసి ఆ తరువాత కైరా ముల్లెర్ ను కిరాతకంగా చంపాడు. 2013 లో కైరా ముల్లెర్ చనిపోగా 2015 సంవత్సరంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కైరా ముల్లెర్ మరణంతో బాగ్దాదీని చంపటానికి ఆపరేషన్ కైరా ముల్లెర్ మొదలైంది. సెప్టెంబర్ నెలలో ఇరాక్ అధికారులు ఒక వ్యక్తిని బాగ్దాదీ సోదరులను వేరే ప్రాంతానికి తరలించటానికి సహాయం చేసినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ద్వారా బాగ్దాదీ ప్రయాణించే వివరాలను ఇరాన్ అధికారులు అమెరికా నిఘా సంస్థకు తెలియజేశారు. ఆ తరువాత యూరోప్ ఇంటెలిజెన్స్ వర్గాలు బాగ్దాదీ సిరియాలోని భగూజ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. 
 
ఇంటెలిజెన్స్ వర్గాలకు బాగ్దాదీ అతని సన్నిహితుని ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన అమెరికా ప్రత్యేక బలగాలు ఆపరేషన్ కైరా ముల్లెర్ ను మొదలుపెట్టాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బాగ్దాదీ ఉన్న ఇంటి ప్రాంగణాన్ని ఎనిమిది హెలికాఫ్టర్లు చుట్టుముట్టాయి. బాగ్దాదీ అతని పిల్లలతో ఒక సొరంగ మార్గంలోకి వెళ్లిపోయాడు. అమెరికా ప్రత్యేక బలగాలు సొరంగంలోకి కుక్కలను పంపించటంతో బాగ్దాది ఒంటిపై అమర్చుకున్న బాంబులను పేల్చుకొని మరణించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: