గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశి రాజీనామా టి కప్పులో తుపాను లాంటిదే అని party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టిడిపి నేతలంటున్నారంటే రాజీనామా వ్యవహారాన్ని ఎంత లైటుగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. ఎంఎల్ఏ రాజీనామా వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు  చంద్రబాబునాయుడు విజయవాడ ఎంపి కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణకు బాధ్యతలు అప్పగించారు.

 

ఇదే విషయాన్ని నాని మాట్లాడుతూ వంశీ రాజీనామా వ్యవహారం టి కప్పులో తుపాను లాంటిదే అని కొట్టిపడేశారు. ఇలాంటవన్నీ వస్తుంటాయ్, పోతుంటాయ్ అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. చంద్రబాబు ఆదేశాలమేరకు తాము ఎంఎల్ఏతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.  ’పార్టీకి వంశీ అవసరం ఉంది... వంశీకి పార్టీ మద్దతుగా నిలబడుతుంది’ అని నాని అన్నారు.

 

ఎంఎల్ఏకి పార్టీలో ఇబ్బందులు ఎదురైన మాటను ఎంపి కూడా అంగీకరించారు. ఇబ్బందుల విషయంలో ఎంఎల్ఏ చెప్పిందాంట్లో అబద్ధమేమీ లేదన్నారు. వంశీ చెప్పిన అన్నీ విషయాలను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు ఎంపి చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే దేవినేని వల్ల వంశీ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు పార్టీలో చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఎంఎల్ఏ రాజీనామా చేసిన తర్వాతే చంద్రబాబులో కదలిక రావటం విచిత్రం కాక మరేమిటి ?

 

 ఇక మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ అయితే అసలు వంశీ రాజీనామాను ఓ ప్రహసనం అన్నట్లుగా కొట్టిపడేశారు. రాజీనామా చేయదలచుకున్నవారు ఎవరూ వాట్సప్ లో రాజీనామాను పంపరంటూ ఎద్దేవా చేశారు. ’రాత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉదయం సుజనా చౌదరితో కారులో ప్రయాణం చేస్తు మాట్లాడారు.

 

మధ్యాహ్నానికి జగన్మోహన్ రెడ్డితో భేటి అయ్యారు’…’మళ్ళీ చంద్రబాబును కలసినా ఆశ్చర్యం లేదు’ అని అన్నారంటే ఎంఎల్ఏ వ్యవహారాన్ని బోండా ఎంత లైట్ గా తీసుకున్నారో అర్ధమైపోతోంది. వాట్సప్ లో రాజీనామాలను పంపటం నాన్సెన్స్ అంటూ కొట్టిపడేశారు. నిజంగా రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో చేసి స్పీకర్ కు ఇస్తారు కానీ చంద్రబాబుకు ఇస్తారా అంటూ బోండా అడిగిన ప్రశ్నపై ఆలోంచించాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: