నారావారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడుకు ఇదే మంచి ఛాన్స్. అప్పుడంటే ఏదో పొరబాటున మంగళగిరిలో పోటి చేసి ఓడిపోయాడు కానీ అదే కృష్ణా జిల్లాలో అయితేనా అంటున్నారు ఇపుడు తమ్ముళ్ళు కొందరు. ఇంతకీ విషయం ఏమిటంటే గన్నవరం వల్లభనేని వంశీ ఎంఎల్ఏ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందితే ఉపఎన్నిక రావటం ఖాయమే కదా ?  

 

పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి వంశీ వైసిపిలో చేరుతారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దాంతో చంద్రబాబు అలర్టయ్యారు. వెంటనే కేశినేని నాని, కొనకళ్ళను రంగంలోకి దింపారు. వంశీ మాట్లాడే బాధ్యత వాళ్ళకు అప్పగించారంటేనే అర్ధమైపోతోంది చంద్రబాబు ప్లానేంటో. ఎందుకంటే దేవినేనితో పడకపోవటంతోనే  వంశీ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

సరే వాళ్ళ విషయాన్ని పక్కనపెట్టినా గన్నవరంలో గనుక ఉపఎన్నిక వస్తే ఎవరిని పోటిలోకి దింపాలనే విషయంలో అప్పుడే చంద్రబాబు మంతనాలు మొదలుపెట్టేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  ఈ నేపధ్యంలోనే ఇక్కడ లోకేష్ పోటి చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారట. వంశీ పార్టీని వదిలేయటం ఖాయమనే ప్రచారం జరుగుతుంటే వైసిపిలో మొన్నటి ఎన్నిల్లో పోటి చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావును టిడిపిలోకి రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

 

ఇక్కడే చంద్రబాబు ఆలోచనను అందరూ వ్యతిరేకిస్తున్నారట. వలస నేతలను నెత్తిన పెట్టుకోవటం వల్లే party TDP' target='_blank' title='టిడిపి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టిడిపి నిండా ముణిగిపోయినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదంటున్నారు. యార్లగడ్డ కోసం ప్రయత్నించకుండా లోకేష్ నో లేకపోతే నియోజకవర్గంలోనే ఉన్న నేతల్లో గట్టి నేతను పోటికి దింపాలని డిమాండ్ చేస్తున్నారట.

 

నేతలు డిమాండ్ చేస్తున్నారు సరే చంద్రబాబు కానీ లోకేష్ కానీ అంత ధైర్యం చేస్తారా ? అన్నదే అందరి అనుమానం. మొన్న మంగళగిరిలో పోటి చేసి పరువుపోగొట్టుకున్న చినబాబు ఇపుడు మళ్ళీ గన్నవరంలో పోటికి దిగుతారా ? అన్నదే ప్రశ్న. అధికారంలో ఉన్నపుడే గెలవలేని లోకేష్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అందునా తన పథకాలతో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్న నేపధ్యంలో.....


మరింత సమాచారం తెలుసుకోండి: